యాదాద్రి, జనవరి7 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఊంజల్ సేవోత్సవం వైభవంగా నిర్వహించారు. లక్ష్మి అమ్మవారిని విశేష పుష్పాలతో అలంకరించి మహిళలు మంగళ హారతులతో స్థుతిస్తూ పాటలు పాడుతూ సేవ ముందు నడిచారు. తిరువీధి సేవ అనంతరం అమ్మవారిని బాలాలయం ముఖ మండపంలోని ఊయలలో శయనింపు చేయించారు. గంట పాటు వివిధ రకాల పాటలతో అమ్మవారిని కొనియాడుతూ లాలిపాటల కోలాహలం కొనసాగింది. స్వామివారి ఆర్జిత పూజల కోలాహలం తెల్లవారు జాము మూడు గంటల నుంచి మొదలైంది. నిజాభిషేకంతో ఆరాధనలు ప్రారంభించారు. ఉత్సవ మూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేదనలు అర్పించారు. ఉదయం 8 గంటలకు నిర్వహించిన సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. సుదర్శన ఆళ్వారును కొలుస్తూ హోమం జరిపారు. బాలాలయం ముఖమండపంలో శ్రీవారికి 600 రూపాయల టిక్కెట్ తీసుకున్న భక్తులు సువర్ణపుష్పార్చన జరిపించారు. ప్రతి రోజూ నిర్వహించే నిత్య కల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బాలాలయంలో తిరుప్పావై వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలలో తొమ్మిదవ పాశురాలను అర్చకులు పఠించి భక్తులకు వినిపించారు. అన్ని విభాగాల నుంచి ఆలయానికి రూ. 9,14,162 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఎన్. గీత తెలిపారు.
యాదాద్రీశుడి సేవలో కొండూరి..
జాతీయ సహకార బ్యాంకు సమాఖ్య చైర్మన్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, టెస్కాబ్ వైస్ చైర్మన్, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డితో కలిసి యాదాద్రి లక్ష్మీనరనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు స్వామివారి వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం నూతనాలయ నిర్మాణాలను పరిశీలించారు. వారి వెంట వివిధ జిల్లాల డీసీసీబీ చైర్మన్లు ఉన్నారు.
స్వామివారి పాదాల చెంతకు కాళేశ్వర గంగ : మంత్రి నిరంజన్‌రెడ్డి
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంతకు కాళేశ్వరం జలాలు రానున్నాయని రాష్ట్ర వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 600 మీటర్ల వరకు ఎత్తిపోసి నృసింహస్వామి జలాశయంలో గోదావరి జలాలు నింపి, ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేయనున్నట్లు వివరించారు. శుక్రవారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం బాలాలయ ముఖ మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు స్వామివారి ప్రసాదం అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయంగా యాదాద్రిని తీర్చిదిద్దారని అన్నారు. త్వరలో స్వయంభువుల దేవాలయం పునః ప్రారంభం కావడం ఆనందంగా ఉందని తెలిపారు.
శుక్రవారం నాటి ఆదాయం (రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 87,550
రూ. 100 దర్శనం టిక్కెట్ 34,000
వేద ఆశీర్వచనం 9,600
నిత్యకైంకర్యాలు 2,301
సుప్రభాతం 400
ప్రచారశాఖ 12,000
క్యారీబ్యాగుల విక్రయం 5,500
వ్రత పూజలు 37,600
కళ్యాణకట్ట టిక్కెట్లు 15,200
ప్రసాద విక్రయం 4,01,800
వాహనపూజలు 11,600
టోల్గేట్ 810
అన్నదాన విరాళం 19,759
సువర్ణ పుష్పార్చన 83,200
యాదరుషి నిలయం 44,860
పాతగుట్ట నుంచి 23,320
ఇతర విభాగాలు 54,752