అశ్వారావుపేట రూరల్, జనవరి 2 : నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో ఇండియా టీమ్ రన్నర్‌గా నిలిచింది. ఈ టీమ్‌లో మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీ పరిధిలో ఉన్న పండువారిగూడెం గ్రామానికి చెందిన గిరిజన క్రీడాకారులు కొర్రి జగదీశ్, మడకం లక్ష్మణస్వామి సత్తా చాటారు. బెస్ట్ ప్లేయర్లుగా బహుమతులు అందుకున్నారు. వీరు నేపాల్ వెళ్లేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుండడంతో ‘నమస్తే తెలంగాణ’లో కథనం ప్రచురితమైంది. అది చూసి వాసన్ సంస్థ టీమ్ సభ్యులు రూ.33 వేలు, పండువారిగూడెం యూత్ రూ.10 వేలు, సత్యనారాయణరాజు రూ.15 వేలు, ఇతరులు రూ.4 వేలు అందించారు. దాతల సాయం వల్లనే విజయం సాధించామని, వారికి కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు గ్రామంలో స్వీట్లు పంపిణీ చేశారు. క్రీడాకారులతో పీడీ రవినాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని మల్లాయిగూడెం పంచాయతీ కొండతోగు గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి తుర్సం నాగదుర్గరావు నేపాల్‌లో జరిగిన 800మీటర్ల పరుగు పందెంలో ప్రతిభ చాటాడు.