
అచ్చంపేట, డిసెంబర్ 20 : తెలంగాణ రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా కుట్రలు చేస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం అచ్చంపేట పట్టణంలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రధానమంత్రి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తాలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. చావుడప్పు వాయిస్తూ మోడీ దిష్టిబొమ్మ దహనం చేశా రు. అనంతరం గువ్వల మాట్లాడుతూ తెలంగాణ రైతులకు న్యాయం జరిగేవరకు కేంద్రంపై యుద్ధం చేస్తామన్నారు. రాష్ర్టాలు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉం టుందని, బాధ్యతను బీజేపీ ప్రభుత్వం విస్మరించి తెలంగాణ రైతులపై కక్షపూరితంగా వ్యవహరించ డం తగదన్నారు. రైతాంగంకోసం ఎవరితోనైనా ఎంతకైనా కొట్లాడేందుకు తెగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, మార్కెట్ కమిటీ చైర్మన్ సీఎంరెడ్డి, వైస్‌చైర్మన్ గోపాల్‌నాయక్, ము న్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, జెడ్పీటీసీ మంత్రియానాయక్, ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ తులసీరాం, పీఏసీసీఎస్ చైర్మన్లు నర్సయ్య, రాజీరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పర్వతాలు, పట్టణ అధ్యక్షుడు రమేశ్ పాల్గొన్నారు.