మియాపూర్ : సామాజికదృక్ఫధంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. హఫీజ్‌పేట్ డివిజన్ హుడాకాలనీకి చెందిన గిరి వాచ్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తుండగా అతని కూతురు అరుణకు చేతికి బలమైన గాయమై అత్యవసర చికిత్స అవసరమైంది. ఆ చికిత్సనిమిత్తం అవసరమయ్యే 20వేల రూపా యల చెక్కును హోప్ ఫౌండేషన్ అధ్వర్యంలో ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే చేతులమీదుగా ఆదివారం వారికి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ… హోప్ ఫౌండేషన్ ఛైర్మెన్ కొండావిజయ్కుమార్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆపదలో ఉన్న అభాగ్యులకు ఆపన్నహస్తం అందించి తన సేవానిరతిని చాటుకున్నారన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే విజయ్‌ని శాలువాతో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మాజీకార్పొరేటర్ రంగారావు, వివేకానందనగర్,మాదాపూర్ డివిజన్ల అధ్యక్షులు సంజీవరెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నాయినేని చంద్రకాంతరావు తదితరులు పాల్గొన్నారు.