
మెదక్, డిసెంబర్ 20 :ఆరోగ్య తెలంగాణగా మార్చడంలో అంగన్వాడీ టీచర్ల పాత్ర కీలకమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెదక్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ముగ్గురు సూపర్వైజర్లకు, 278 మంది అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో భార్గవి, మున్సిపల్ చైర్మ న్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగపతి, కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, వసంత్‌రాజ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గడ్డమీది కృష్ణాగౌడ్, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, రాగి అశోక్, కృష్ణ, మధుసూదన్‌రావు, అంగన్వాడీ సూపర్వైజర్లు సంధ్య, సంధ్యారాణి, లక్ష్మీనర్సమ్మ, సీనియర్ అసిస్టెంట్ చిరంజీవి, పోషన్ అభియాన్ సిబ్బంది అన్నారం పాల్గొన్నారు.
ఘనంగా మహారుద్రాభిషేకం
మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 20 :జిల్లా కేంద్రంలోని భగవాన్ సత్యసాయి మందిరంలో సోమవారం రంగంపేట గురు మాదవానంద సరస్వతీ పీఠాధీశ్వరులు మాదవానంద సరస్వతీ స్వామి పర్యవేక్షణలో శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు కౌన్సిలర్లు కిశోర్, మామిళ్ల ఆంజనేయులు, సమియొద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మధుసూదన్‌రావు పాల్గొన్నారు.