హయత్‌నగర్ : దారితప్పి రోడ్డుపైకి వచ్చి ఏడుస్తున్న ఓ చిన్నారిని పోలీసులు తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. ఈ సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… హయత్‌నగర్‌లోని సిఎస్సార్ కాలనీ వైపు నుండి కుంట్లూరు రోడ్డు వైపు ఏడుస్తూ వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిని కానిస్టేబుల్ భద్రి గమనించి పరిసర ప్రాంతాల్లో చిన్నారి వివరాలు గురించి అడిగినా వివరాలు తెలియలేదు.
గ్రీన్ సిటీ కాలనీ పరిధిలోని బీరప్ప టెంపుల్ దగ్గర ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్న బీహార్ రాష్ట్రం వారీగా గుర్తించి బాలిక తండ్రికి అప్పగించారు. దీంతో చిన్నారి తండ్రి, స్థానికులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.