భువనగిరి అర్బన్, జనవరి 7 : నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధే ప్రధానధ్యేయంగా పల్లె పర్యవేక్షణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మన్నెవారిపంపు, వడపర్తిలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల అభివృద్ధి జరుగుతున్నదన్నారు. వార్డుల్లో నీరు నిల్వకుండా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీరోడ్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అర్హులైన వారికి వితంతు పింఛన్లు అందేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. మన్నెవారిపంపు గ్రామంలో హెచ్ఎండీఏ నిధులు రూ.15లక్షలతో 650 మీటర్ల సీసీరోడ్డు పనులు, రూ.32లక్షలతో 1530 మీటర్ల అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, చిన్నేరు వాగుపై బ్రిడ్జి ఏర్పాటుకు ప్రపోజల్ పంపడం, కుర్మాగూడెం నుంచి మన్నెవారిపంపు లింకురోడ్డు వరకు 800 మీటర్ల బీటీరోడ్డు, ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్, పాత గ్రామం నుంచి అనంతారం వెళ్లే మార్గంలో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి కల్వర్టు ఏర్పాటు, పెద్దమ్మతల్లి ఆలయ నిర్మాణం, మదీనా చెరువు వద్ద బోరు మోటార్, మహిళా కమ్యూనిటీ హాల్, గ్రామ పంచాయతీ భవనాల ప్రహరీ ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. అదే విధంగా వడపర్తి గ్రామంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ బీరు మల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు ఎడ్ల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాశ్‌గౌడ్, నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, బల్గూరి మధుసూదన్‌రెడ్డి, అబ్బగాని వెంకట్‌గౌడ్, నరాల వెంకటస్వామి, ర్యాకల శ్రీనివాస్, సర్పంచులు బోయిని పాండు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎంపీటీసీ ఉడుత శారదాఆంజనేయులు, ఉపసర్పంచ్ ఎంపల్ల బానుచందర్రెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పైళ్ల దేవేందర్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.