
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 22 : బంధువు మృతి చెందగా దినవారాలకు హాజరయ్యేందుకు బైక్‌పై కూతుళ్లతో కలిసి తండ్రి వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో బాలిక మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలైన ఘటన జడ్చర్లలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన యాదగిరి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో ప్లంబర్పని చేస్తూ అక్కడే నివసించేవాడు. వారం కిందట సొంతూరికి భార్య పిల్లలతో కలిసి వచ్చాడు. ఇటీవల తన మేనమామ మృతి చెందగా దినవారాలకు హాజరయ్యేందుకు బుధవారం ఉ దయం భార్య, సోదరిని యాదగిరి హైదరాబాద్ బస్సు ఎ క్కించాడు. తర్వాత తన ఇద్దరు కూతుళ్లు నందిని (11), అనిత (8)ను తన మోటర్ సైకిల్‌పై ఎక్కించుకొని స్వగ్రా మం నుంచి బయలుదేరాడు. ఈ క్రమంలో జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారి -44పై వెళ్తుండగా.. ప క్కనే ఉన్న సర్వీస్ రోడ్డుపై నుంచి అకస్మాత్తుగా వేగంగా వచ్చి లారీ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న నందిని రోడ్డుపై పడడంతో ఆమె తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. యాదగిరి, చిన్న కూతురు అనితకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసు లు క్షతగాత్రులను అంబులెన్స్‌లో జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రమేశ్‌బాబు తెలిపారు. కండ్ల ఎదుటే కూతురు చనిపోయిందని తండ్రి రోదించాడు. ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.