యాదాద్రి, జనవరి 9 : ప్రతిపక్ష పార్టీల అనుచిత వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి పార్టీ యువజన నాయకులకు సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ యవజన విభాగం విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ బలోపేతంలో యువత అన్ని విధాలా ముందుండాలన్నారు. రాబోయే రోజుల్లో యువతకు అన్ని విధాలుగా ప్రోత్సాహం లభించేలా పార్టీ చర్యలు తీసుకుంటుందన్నారు. మహిళలకు కేసీఆర్ కిట్, అమ్మ ఒడి, కల్యాణలక్ష్మి పథకంతో ఆర్థిక సాయం, రైతులకు రైతుబంధు, రైతుబీమా, వృద్ధులకు ఆసరా పింఛన్ వంటి పథకాలతో కేసీఆర్ అద్భుతమైన పాలన సాగిస్తున్నారని తెలిపారు. ఎంతోమంది యువతకు ఉద్యోగాలు ఇచ్చారని, ఇందుకు గ్రామల్లో ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులే అందుకు నిదర్శనమని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పస్పరి శంకరయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు పుట్ట మల్లేశం పాల్గొన్నారు.
ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం సహాయనిధి వరమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. అనారోగ్యం బారిన పడి ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందిన యాదగిరిగుట్ట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన వీరవెల్లి కవితకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.3లక్షల చెక్కును ఆదివారం వంగపల్లి గ్రామంలో ఆమె కుటుంబ సభ్యులకు అందించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన వెంట రామాజీపేట సర్పంచ్ మొగిలిపాక తిరుమలారమేశ్, ఉప సర్పంచ్ శేఖర్‌రెడ్డి, శ్రీకర్‌రెడ్డి, జంగయ్య, కిరణ్ పాల్గొన్నారు.