Development of rural areas | గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం : రాష్ట్రంలో ఉన్న గ్రామీణ ప్రాంత రోడ్ల మరమ్మతులు, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మన్సాన్పల్లిలో రూ.1.50 కోట్లతో సీసీ రోడ్డు పనులను ఎంఎల్సీ సురభి వాణీదేవి, జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహేశ్వరం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దుతా నన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి దేశంలో ఎక్కడాలేని విధంగా కంపెనీలు వస్తున్నాయన్నారు. మన్సాన్పల్లి రస్తాను వెడల్పు చేసి ఆధునీకరిస్తామన్నారు.
మహేశ్వరం గేటు నుంచి మహేశ్వరానికి రోడ్డు విస్తరణ పనులకు రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రోడ్లు బాగుండాలన్నారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రోడ్ల అభివృద్ధికి రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతి మండలానికి, ప్రతి గిరిజన గ్రామానికి రోడ్లు ఉండాలని సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు.
మండల కేంద్రంలో జరిగే రోడ్డు నిర్మాణ పనులకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘుమారెడ్డి, సహకారబ్యాంక్ చైర్మన్ మంచె పాండుయాదవ్, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి నాయకులు కూనయాదయ్య, మండల రైతుబంధు చైర్మన్ రాఘవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్, ఎంపీడీవో నర్సింలు, తహసీల్దార్ ఆర్పీజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

