సైదాపూర్, డిసెంబర్ 28: గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం ప్రారంభించారు. అనంతరం తహసీల్ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఇద్దరు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతున్నట్లు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణంతో నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని, ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ పేరాల గోపాలరావు, ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు చంద శ్రీనివాస్, సింగిల్‌విండో చైర్మన్లు బిల్ల వెంకటరెడ్డి, కొత్త తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సోమారపు రాజయ్య, ప్రధాన కార్యదర్శి చెలిమెల రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచులు కాయిత రాములు, కొండ గణేశ్, తాటిపల్లి యుగేంధర్‌రెడ్డి, అబ్బిడి పద్మ-రవీందర్‌రెడ్డి, చింత లత-కుమారస్వామి, ఆవునూరి పాపయ్య, తొంట కాంతమ్మ, బొడిగ పద్మజ-కొమురయ్య, కొత్త రాజిరెడ్డి, బత్తుల కొమురయ్య, రేగుల సుమలత-అశోక్, సుశీల-తిరుపతిగౌడ్, ఎంపీటీసీలు అనితారవీందర్రెడ్డి, ఓదెలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.