హఫీజ్పేట్ : శేరిలింగంపల్లిని అన్ని రంగాల్లో అభివృద్ధిచేసి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషిచేస్తున్నట్లు ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం వివేకానందనగర్ డివిజన్ పరిధిలోని వివేకానందనగర్ కాలనీలో రూ.38లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీరోడ్డు పనులను మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి ఆయన పరిశీలించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…కరోనామహమ్మారి వంటి విపత్కర పరిస్ధితులు ఎదురైనప్పటికి అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రప్రభుత్వం ఏమాత్రం వెనకంజవేయకుండా చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో మంత్రికేటీఆర్ సహకారంతో శేరిలింగంపల్లి ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ అత్యున్నత జీవనప్రమాణాలు కల్పించి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చుదిద్దుతానన్నారు.
మెరుగైన వసతుల కల్పనలో భాగంగా అన్నిడివిజన్లలో కాలనీ, బస్తీఅనే తేడాలేకుండా కాలనీ చివరన ఉన్నప్రాంతాల్లో సైతం సీసీరోడ్ల ఏర్పాటుకు కృషిచేస్తున్నామన్నారు. చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకొంటూనే ప్రజలకు ఏలాంటి ఇబ్బందుల్లేకుండా త్వరతగతిన పూర్తిచేయాలన్నారు. కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఎరగుడ్ల శ్రీనివావాస్ యాదవ్ కాలనీవాసులు పాల్గోన్నారు.