
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 : రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మం గళవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎదిర గ్రామ శివారులో రూ.2.75 కోట్లతో నిర్మించిన గిరిజన మహిళా ఉద్యోగినుల వసతి గృహాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్న త చదువులు చదువుతూ ముందుకు వెళ్తేనే సమాజంలో గుర్తింపు ఉంటుందన్నారు. గిరిజన మహిళా ఉ ద్యోగినుల 150 మందికి వసతి కల్పించేలా ఏర్పాటు చేసి ఒక సొసైటీ ద్వారా వారికి అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. పోస్ట్‌మెట్రిక్ వసతి గృహాన్ని జనవరిలోగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. మరో రూ.10 లక్షలు ఖర్చు చేసి గిరిజన యువజన భవన్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో జిల్లాలోని గిరిజన రెసిడెన్షియల్ పాఠశాల భవనాన్ని నిర్మించనున్నట్లు చెప్పారు. సేవాలాల్ మహరాజ్ దేవాలయ ఏర్పాటు నిమిత్తం స్థలం కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. పాలమూరులో సుమారు రూ.13 కోట్ల వ్యయంతో గిరిజనుల కోసం వివిధ భవనాలు నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనులు గౌరవంగా బతుకుతున్నారన్నా రు. తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం గిరిజనులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సర్కార్ అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. దివిటిపల్లి భూ నిర్వాసితులు 56 మందికి పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ఆర్డీవో పద్మశ్రీ, గిరిజన సంక్షేమ శాఖ జి ల్లా అధికారి ఛత్రు, నాయకులు రాజు, నాయక్, రవీందర్, చందర్‌నాయక్, కౌన్సిలర్ యాదమ్మ, హనుమం తు తదితరులు పాల్గొన్నారు.
కిక్ బాక్సింగ్ క్రీడాకారుడికి అభినందన
మహబూబ్‌నగర్ టౌన్, డిసెంబర్ 28 : మహారాష్ట్రలోని పూణెలో ఇటీవల జరిగిన జాతీయస్థాయి కిక్‌బాక్సింగ్ టోర్నీలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుడిని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. జిల్లా కేంద్రంలోని ఆర్కే స్పోర్ట్స్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థి జగదీప్‌సింగ్ కిక్ బాక్సింగ్ టోర్నీలో బంగారు పతకం సాధించాడు. మంగళవారం మంత్రి అతడిని అభినందించి ఆత్మరక్షణకు ప్రతి ఒక్కరూ మా ర్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని సూచించారు. జాతీయ స్థా యిలో రాణించడం సంతషంగా ఉన్నదని చెప్పారు. కా ర్యక్రమంలో మాస్టర్ రవికుమార్, కౌన్సిలర్ రష్మిత, నాయకులు ప్రశాంత్, వర్నిత్, దినేష్, విశాల్, విజయ్‌కుమార్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.