
జడ్చర్ల, డిసెంబర్ 22 : రాష్ట్రంలోని పేదలు పండుగలను సంతోషంగా జరుపుకోవాలన్నదే సర్కార్ ధ్యేయమని, అందుకే కానుకలను అందజేస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జడ్చర్లలోని బేతని ఎంబీ చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏ డాది ప్రభుత్వం క్రిస్మస్ పండుగకు కానుకలను అందజేస్తున్నదని చెప్పారు. క్రిస్టియన్లకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలోని వెయ్యి మంది నిరుపేదల కు ఈ కానుకలు అందజేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కేసీఆర్ కులమతాలకు అతీతంగా పరిపాలన అందిస్తున్నారన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో రూపంలో సంక్షేమ పథకం అందుతున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ లక్ష్మీనారాయణ, ము న్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జంగయ్య, మాజీ వైస్ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మురళి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ర ఘుపతిరెడ్డి, వైస్ చైర్మన్ సారిక, కౌన్సిలర్లు లత, రమేశ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్, ప్రీతం, ఇమ్మూ, బేతని ఎంబీ చర్చి అధ్యక్షుడు బెంజమెన్, కార్యదర్శి దేవదానం, దానియేలు, నిత్యానందం రూబేన్, కాలేబు తదితరులు పాల్గొన్నారు.