
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వానకాలంలో సోన,
దొడ్డురకం సాగవగా.. సిరుల దిగుబడులు వచ్చాయి. అయితే కేంద్రం వరి కొనుగోలు విషయంలో
మీనమేషాలు లెక్కిస్తుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి అన్నదాతకు అండగా నిలిచింది.
ఇందుకోసం 800కుపైగా కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నది. 14.51 లక్షల
మెట్రిక్ టన్నులు సేకరించాలని వ్యవసాయ అధికారులు అంచనా వేయగా.. ప్రస్తుతానికి 3.22 లక్షలమెట్రిక్టన్నులు సేకరించారు. విక్రయించిన రైతులకు కూడా త్వరగా డబ్బులు చెల్లిస్తున్నారు.
మహబూబ్నగర్ టౌన్, డిసెంబర్ 16 : ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు గురువారం విడుదలయ్యా యి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30,168 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 11,440 (37.92 శాతం) మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలిక లు 15,523 మందికిగానూ 6,893 (44.04 శాతం) మంది, బాలురు 14,645 మందికిగానూ 4,547(31 శాతం) పాస్ అయ్యారు. మహబూబ్నగర్ జిల్లాలో 11,354 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరుకాగా 5,065 (45 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సా ధించగా మొదటి స్థానంలో నిలిచింది. వనపర్తి జిల్లాలో 7,034 మందికిగానూ 2,796 (40 శాతం) మంది విద్యార్థు లు ఉత్తీర్ణత సాధించగా రెండో స్థానంలో నిలిచింది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు 38 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో నిలిచాయి. గ ద్వాలలో 4,303 మందికిగానూ 16,0 23 (38 శాతం) మంది, నారాయణపే ట జిల్లాలో 4,952 మంది పరీక్షలు రా యగా.. 1,867 (38 శాతం) మంది వి ద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. చివరి స్థానంలో నాగర్కర్నూల్ జిల్లా నిలిచిం ది. 7, 549 మంది విద్యార్థులు పరీక్షల కు హాజరుకాగా 2,732 (36 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఉమ్మడి జిల్లా ఫలితాల్లో బాలుర కంటే బాలికలదే పైచేయి అయింది.