
ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం ఉత్సవాలు అంబరాన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు గ్రామగ్రామాన వేడుకలు నిర్వహించారు. మహిళలు ఇండ్ల ముందు రైతుబంధు ముగ్గులు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గ్రామస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొణిజర్ల మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు పాల్గొన్నారు. చింతకాని మండలంలో జరిగిన సంబురాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మం నగరంలోని సమీకృత రైతుబజార్ వేడుకలో ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రవాణ శాఖ మంత్రి అజయ్‌కుమార్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రైతుబంధు ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
ఖమ్మం, జనవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో రైతుబంధు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు ఆదివారం సంబురాలు మిన్నంటాయి. రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు ఘనంగా రైతుబంధు ఉత్సవాలు నిర్వహించారు. మహిళలు ఇండ్ల ముందు రైతుబంధు ముగ్గులు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రైతులు పొలాల్లో ధాన్యం, కూరగాయలతో రైతుబంధు అక్షరమాల రూపొందించారు. విద్యాశాఖ పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖన పోటీలు నిర్వహించింది. రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల, చిమ్మపూడి, వీవీ పాలెంలో జరిగిన వేడుకలో మంత్రి అజయ్‌కుమార్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొణిజర్ల మండలంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే రాములునాయక్ పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన ఉత్సవాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు పాల్గొన్నారు. గ్రామస్తులు నియోజకవర్గవ్యాప్తంగా ఎడ్లబండి, ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. చింతకాని మండలంలో సంబురాల్లో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మం నగరంలోని సమీకృత రైతుబజార్ వేడుకలో ఏఎంసీ చైర్పర్సన్ డీ లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు.