
కొత్తకోట, డిసెంబర్ 19: రైతులతో రాజకీయాలు చేస్తే బీజేపీ ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా చేయాలని, ప్రజలే బీజేపీని చావు దెబ్బ కొట్టాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని మున్సిపల్ చైర్పర్సన్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతుల కోసం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ఓర్వలేక ముఖ్యమంత్రిపై కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. వడ్ల కొనుగోలుపై కేంద్రం దిగి వచ్చేంత వరకు పోరాటం చేయాలన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే రైతులను కేంద్ర ప్రభుత్వం వేదిస్తూ ఆర్థికంగా దెబ్బతీయాలని కుట్ర పన్నుతుందన్నారు. 2014కు ముందు 34లక్షల ఎకరాల సాగు జరిగేదని, ప్రస్తుతం కోటి 4లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతుబీమా, రైతుబంధు, 24గంటల విద్యుత్, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. కేంద్రం ఆధీనంలో ఉన్న ఎఫ్‌సీఐల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని అన్నారు. దేశంలో విమానం, రైల్లు, ఎల్ఐసీ ప్రైవేటీకరణ చేస్తూ బడా కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా చేస్తుందన్నారు. సోమవారం చేపట్టే నిరసన సెగ కేంద్రానికి తగలాలన్నారు. ఈ సమావేశంలో జెడ్పీవైస్ చైర్మన్ వామన్‌గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వంశీధర్‌రెడ్డి, రైతుబంధు మండలాధ్యక్షుడు గిన్నె కొండారెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, వైస్ ఎంపీపీ వడ్డె శ్రీనివాసులు, కౌన్సిలర్లు అయ్యన్న, రామ్మోహన్‌రెడ్డి, రాములుయాదవ్, ఖాజమైనొద్దీన్, సంధ్యారవీందర్రెడ్డి, తిరుపతయ్య, కోఆప్షన్ సభ్యులు వహిద్, అద్వాని శ్రీను, వసీంఖాన్, పట్టణాధ్యక్షుడు బాబురెడ్డి, నాయకులు బాలకృష్ణ, నిర్మలారెడ్డి, శ్రీనుజీ, సాజద్అలీ, లాలు, సుభాష్, హనుమంతుయాదవ్, వికాస్, కిరణ్, తాహెర్‌బాబా తదితరులు పాల్గొన్నారు.