రఘునాథపాలెం, జనవరి 9: సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో సాగు పండుగ చేశారని, పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల, చిమ్మపూడి, వీ వెంకటాయపాలెంలో ఆదివారం నిర్వహించిన రైతుబంధు ఉత్సవాల్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు ప్రజలే గుణపాఠం చేప్తారన్నారు. మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల నిర్మాణం, రైతుబంధు, రైతుభీమా పథకాలు యావత్ దేశానికి దిక్సూచి అయ్యాయన్నారు. ఎకరానికి రూ.5 వేలు చొప్పున ఏడాదిలో రెండు పంటలకు రూ.10 వేలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు. పాసుబుక్ ఉన్న ప్రతి ఒక్కరికీ పెట్టుబడి సాయం అందుతుందన్నారు. నాలుగేళ్లలో రూ.50 వేల కోట్లు జమ చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులను ఆదుకుంటున్నారని కొనియాడారు. ప్రతి సీజన్‌కు రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేస్తున్నారన్నారు. రైతు సంక్షేమ పథకాలను మెచ్చి యువత సాఫ్ట్వేర్ ఉద్యోగాలను వదిలి సాగు బాటపడుతున్నారన్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఏడాదికి రెండు పంటలకు దిగుబడి రూ.3 కోట్ల టన్నులకు చేరిందన్నారు.
కాంగ్రెస్ హయాంలో రైతులకు అన్యాయం..
దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ నేతలను రైతులను పట్టించుకోలేదన్నారు. వారి పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కేంద్రంలోని బీజీపీ రైతు వ్యతిరేర విధానాలు చేస్తున్నదన్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రాష్ట్ర రైతాంగాన్ని రెచ్చగొడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడ్డారన్నారు. పంటలకు కరెంటు ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. ట్రాన్స్ఫార్మర్లు, మోటర్లు కాలిపోయేవన్నారు. ఎరువులు, విత్తనాలకు రోజుల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చేదన్నారు. పెట్టుబడి కోసం దళారులు, వడ్డీ వ్యాపారుల వద్దకు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేవన్నారు. చిమ్మపూడిలో వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, వేపకుంట్లలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ పొట్లపల్లి రాజా, వీ వెంకటాయపాలెంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. అనంతరం మంత్రి గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు సంబురాల్లో భాగంగా మహిళలతో కలిసి నృత్యం చేశారు. కార్యక్రమాల్లో జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజ్, ఖమ్మం ఏఎంసీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ కొంటెముక్కల వెంకటేశ్వర్లు, ఎంపీపీ భూక్యా గౌరి, జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ, నాయకులు నర్సింహారావు, సుధాకర్, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, కుర్రా భాస్కర్‌రావు, సైదులు, రవి, వీరబాబు, రామకృష్ణ, విజయ్‌రెడ్డి, వేణు, నాగేశ్వరరావు, సర్పంచ్‌లు గొర్రె కృష్ణవేణి, ధారా శ్యాం, రావెళ్ల మాధవి తదితరులు పాల్గొన్నారు.