నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 7: జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మండల కేంద్రాల తోపాటు వివిధ గ్రామాల్లోని కళాశాలలు, పాఠశాలల్లో చదువు తున్న టీనేజర్లకు వైద్యసిబ్బంది శుక్రవారం వ్యాక్సిన్ ఇచ్చారు. టీనేజర్లు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని వైద్యసి బ్బంది సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలన్నారు.
జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్కే డిగ్రీ, పీజీ కళాశాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జోహా ప్రారంభించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ జైపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్ గురువేందర్‌రెడ్డి, సమన్వయకర్త దత్తాద్రి, కౌన్సిలర్ వనితారామ్మోహన్, అధ్యాపకులు, విద్యార్థులు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. బాన్సువాడ మండలంలోని బోర్లం మైనార్టీ గురుకుల పాఠశాలలో ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు టీకాలు వేశారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తబాది ఆదర్శ పాఠశాల, బోర్లం, కోనాపూర్, దేశాయిపేట్ పాఠశాలల్లో 15 నుంచి 18 ఏండ్ల వయస్సున్న విద్యార్థులకు వైద్యసిబ్బంది టీకాలు వేశారు.
ఎల్లారెడ్డి పట్టణంలోని దవాఖానలో 83 మందికి టీకాలు వేయగా మత్తమాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది పలు ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో సుమారు రెండు వందల మంది టీనేజర్లకు కొవిడ్ టీకాలు వేశారు.
గాంధారి, ఉత్తనూర్ ప్రభుత్వ దవాఖానతోపాటు వివిధ గ్రామాల్లో 229 మందికి మొదటి, రెండో డోస్ కరోనా టీకాలు వేసినట్లు వైద్యాధికారి హరికృష్ణ తెలిపారు. 312 మంది టీనేజర్లకు టీకా వేసినట్లు ఆయన తెలిపారు.
పిట్లం మండలం గోద్మేగాం గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలను ఎంపీడీవో వెంకటేశ్వర్ తనిఖీ చేశారు. 15 నుంచి 18 ఏండ్ల పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలని ప్రధానోపాధ్యాయుడు హరిసింగ్‌కు సూచించారు. పంచాయతీ కార్యదర్శి శ్రీలత, ఉపాధ్యాయులు ఉన్నారు.
నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామంలోని జడ్పీహెచ్ఎస్లో చదువుతున్న టీనేజర్లకు టీకాలు వేసినట్లు సర్పంచ్ వీణ తెలిపారు. ఎంపీటీసీ లావణ్య, ఉప సర్పంచ్ ధర్మవీర్ పాల్లొన్నారు.
తాడ్వాయి మండలంలోని కరడ్‌పల్లి, చిట్యాల, దేమెకలాన్, తాడ్వాయి, ఎర్రాపహాడ్‌లో ఉన్న ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న టీనేజ్ విద్యార్థులకు వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు.
రామారెడ్డిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న 116 మంది విద్యార్థులకు రామారెడ్డి ప్రభుత్వ దవాఖాన వైద్యుడు షాహిద్‌అలీ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. కళాశాల ప్రిన్సిపాల్ మధుశ్రీవాత్సవ, లెక్చరర్లు కృష్ణవేణి, రాజాగౌడ్, తిరుపతి, వైద్య సిబ్బంది విమలాభారతి, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
నిజాంసాగర్లోని ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదు వుతున్న 60 మంది విద్యార్థులకు వైద్యశాఖ సిబ్బంది వ్యాక్సి న్ వేశారు. ప్రధానోపాధ్యాయుడు వెంకటేశం, ఉపాధ్యాయు లు వెంకటి, వైద్యశాఖ సిబ్బంది సాయిలు, సునీత ఉన్నారు.