
వివిధ పనుల మీద వచ్చిన వారిని గమ్యస్థానాలకు చేర్చాల్సిన రహదారులు మృత్యు మార్గాలుగా మారుతున్నాయి. త్వరగా వెళ్లాలన్న ఆతృతతో అతివేగం, అజాగ్రత్తతో కొందరు.. నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో మరికొందరు.. మద్యం తాగి
ఇంకొందరు వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణం అవుతున్నారు. బైక్‌దారులు హెల్మెట్ లేకుండా, రాంగ్‌రూట్ డ్రైవింగ్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకొని వారి జీవితాలను కోల్పోతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలోని రోడ్లన్నీ రక్తమోడుతున్నాయి. ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోగా.. మరెందరో క్షతగాత్రులుగా మిగిలిన ఘటనలెన్నో ఉన్నాయి. అందుకే ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించడంతోపాటు రోడ్డు నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను అరికట్టవచ్చు. అప్పుడే క్షేమంగా వారిగమ్యస్థానాలకు చేరుకోవచ్చు.
రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబానికి అతనే పెద్ద దిక్కు. వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్న అతను బైక్‌పై వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అతడి మృతితో ఆ కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది.
డిగ్రీ పూర్తి చేసిన ఓ యువకుడు ఏడాది కిందట తన తండ్రి చనిపోవడంతో చదువును మధ్యలో ఆపేసి కుటుంబ పోషణ కోసం వ్యవసాయం చేస్తుండేవాడు. తన మిత్రుడితో కలిసి బైక్‌పై జడ్చర్లకు వెళ్తుండగా.. ఓ లారీ ఢీకొనడంతో అతడి తలకు బలమైన గాయమై అక్కడే మృతి చెందాడు. అండగా ఉన్న కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబంలో
విషాదం మిగిలింది.
అతను అధికారి. అతడిపైనే కుటుంబమంతా ఆధారపడింది. ఇంటికి ఆఫీస్ దగ్గరే కదా అని హెల్మెట్ లేకుండా బైక్‌పై బయలుదేరాడు. కొద్దిసేపటికే వెనుక నుంచి ఓ వాహనం వచ్చి ఢీకొట్టింది. దీంతో అతడి తలకు బలమైన గాయమైంది. వెంటనే అక్కడున్న వారు గుర్తించి అతడిని దవాఖానకు తీసుకెళ్లేలోగా ప్రాణాలు
హరీమన్నాయి. ఒక వేళ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణాలతో బతికి బయటపడేవాడేమో. ఇంటి
పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబం
విషాదంలో మునిగిపోయింది.
తండ్రి, కుమార్తె కలిసి ఇంటి నుంచి స్కూటీపై బయలుదేరిన కొద్దిసేపటికే రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కూతురి తలకు బలమైన గాయమై కోమాలోకి వెళ్లింది. తండ్రీకూతురు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వైద్య సాయానికి ఆర్థిక స్థోమత లేక ఆ కుటుంబం
ఇబ్బందులు పడుతున్నది.
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 24 : సత్వరమే గమ్యానికి చేరాలన్న ఆతృతతో అతివేగం, అజాగ్రత్తతో వాహనాలను నడుపుతూ ప్రమాదాలకు గురవుతున్నారు. మరికొందరు నిర్లక్ష్యంగా.. మద్యం తాగి డ్రైవ్ చేస్తున్నా రు. ప్రధానంగా ద్విచక్రవాహనదారులు హెల్మెట్ లేకుండా వెళ్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. త్రిపుల్ రైడింగ్ చేయడం.. రాంగ్రూట్లో వెళ్లడం వంటివి చేస్తున్నారు. నిబంధనలు తెలిసిన వారు సైతం వాటిని విస్మరిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరు క్షతగాత్రులుగా మిగిలి జీవితాంతం బాధపడుతున్నారు. తమ కుటుంబానికి కూడా తీరని శోకం మిగిలిస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు లేకుంటే వారి పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. జడ్చర్ల పరిధిలోని రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎక్కువ శాతం హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికైనా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి..
ప్రమాదాల నివారణకు చేయాల్సినవి..
హెల్మెట్ ఉంటేనే సెజ్‌లో పార్కింగ్..
రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లో కొన్ని కంపెనీలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు బైక్‌లపై వస్తే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ఉంటేనే కంపెనీలో పార్కింగ్ చేసేందుకు అనుమతిస్తున్నారు. ఇదే తరహాలో ద్విచక్రవాహనదారులు నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా సినిమాహాళ్లు, ఫంక్షన్‌హాళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్సులు, ఇతర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రదేశాల్లో హెల్మెట్ ఉన్న వాహనాలకు మాత్రమే లోపలికి ప్రవేశం కల్పించేలా చర్యలు తీసుకోవాలి. దీంతో కొంతమేరనైన హెల్మెట్ వాడకంపై అవగాహన ఏర్పడే అవకాశాలున్నాయి.
బైక్‌తోపాటు హెల్మెట్ కొనాలని చెబుతున్నాం..
షోరూంలో బైక్‌తోపాటు తప్పనిసరిగా హెల్మె ట్ కొనేలా ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్ సమయంలో కూడా ఆర్టీఏ అధికారులు హెల్మెట్ తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నా రు. కానీ, చాలా మంది ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు. మా షోరూంలో మాత్రం బైక్‌తోపాటు హెల్మెట్ కొనమని చెబుతున్నాం. మా వద్దే హెల్మెట్ కొనాలన్న నిబంధన లేదు. కొంద రు హెల్మెట్ ఉందంటున్నారు. మరికొందరు ఆ ర్థికస్థోమత బట్టి కొంటున్నారు. నాణ్యత ఉన్న హెల్మెట్ ధరించి వాహనాలను నడిపితే ప్రమాదాల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. – రవి, బైక్ షోరూం నిర్వాహకుడు, జడ్చర్ల
ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నాం..
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కువ శాతం హెల్మెట్ లేకపోవడంతోనే ప్రాణనష్టం జరుగుతున్నది. తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నాం. ఆకస్మిక తనీఖీలు చేపడుతూ జరిమానాలతోపాటు వాహనాలను సీజ్ చేస్తున్నాం. ఇ న్సూరెన్స్, ఆర్సీ కూడా ఉండాలని సూచిస్తు న్నాం. త్రిపుల్ రైడింగ్, రాంగ్‌రూట్, మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై కఠినంగా వ్య వహరిస్తున్నాం. ఓవర్స్పీడ్ను గుర్తించేలా స్పీడ్‌గన్ ఏర్పాటు చేయనున్నాం. ప్రమాదకరమైన ప్రాంతాల్లో సూచికలు ఏ ర్పాటు చేస్తున్నాం.