
అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న రోడ్ల నిర్మాణంలో వేగం పెంచాలని, పార్కుల సుందరీకీకరణ పనులను చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి, పార్కుల సుందరీకీకరణపై మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోడ్ల అభివృద్ధి, పార్కుల సుందరీకీకరణ పనులకు సంబంధించిన పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలను ప్రజలకు ఇబ్బంది లేకుండా సజావుగా చేపట్టి పూర్తి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈలు ప్రేరణ, శ్వేత, దివ్య, నరేందర్, వర్క్ ఇన్స్పెక్టర్లు రవి, మనోహర్, ఎలక్టికల్ డీఈ వెంకటరమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.