యాదాద్రి, జనవరి6 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్తర పూజలు జరిపించారు. అనంతరం భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారు. ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్య తిరుకల్యాణం నిర్వహించారు. కొండపైన ఉన్న పర్వతవర్ధినీ రామలింగేశ్వరుడికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పార్వతీదేవిని కొలుస్తూ కుంకుమార్చన జరిపారు. ఆలయ పుష్కరిణి చెంత భక్తులు పుణ్యస్నానం ఆచరించి సంకల్పంలో పాల్గొన్నారు. రాత్రి బాలాలయంలో ప్రతిష్ఠామూర్తులకు ఆరాధన, సహస్రనామార్చనలు జరిగాయి.
ఆలయంలో ప్రతిష్టాత్మకంగా జరుపుకొనే సత్యనారాయణ స్వామివారి వ్రత పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బాలాలయంలో తిరుప్పావై వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలలో తొమ్మిదవ పాశురాలను అర్చకులు పఠించి భక్తులకు వినిపించారు. శ్రీవారి ఖజానాకు గురువారం రూ. 11,84,972 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం
ప్రధాన బుక్కింగ్ ద్వారా 77,150
రూ. 100 దర్శనం టిక్కెట్ 27,000
సుప్రభాతం 100
వేద ఆశీర్వచనం 4,200
నిత్యకైంకర్యాలు 1,100
ప్రచారశాఖ 17,000
క్యారీబ్యాగుల విక్రయం 9,350
వ్రత పూజలు 3,2000
కళ్యాణకట్ట టిక్కెట్లు 13,800
ప్రసాద విక్రయం 5,22,550
వాహన పూజలు 8,800
టోల్గేట్ 429
అన్నదాన విరాళం 24,720
సువర్ణ పుష్పార్చన 79,400
యాదరుషి నిలయం 35,780
పాతగుట్ట నుంచి 16,500
సుప్రభాతం 1200
గోపూజఋ 200
ఇతర విభాగాలు 2,73,802