కందుకూరు : రాష్ట్రంలో ప్రతి పక్షాలకు నామరూపల్లేకుండా చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సార్లరావులపల్లి తండాకు చెందిన బాలు, శ్రీను, బీమ్ నాయక్, గోపాల్, హరి,రవి, శ్రీరామ్ తో పాటు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు బంజారసంఘం రాష్ట్ర నాయకులు ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వారందరికీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పార్టీ కండువాలను కప్పి సాదారంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సుబిక్షంగా ఉంచడానికి కృషి చేస్తున్నారని తెలిపారు. అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సమర్ధవంతంగా అమలు చేస్తుంటే కాంగ్రెస్,బీజేపీ నాయకులకు మింగుడు పడక ఎప్పుడు అధికారంలోకి రావాలని అత్యాశతో ప్రభుత్వంపై నిరాధార మైన ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.
గిరిజనులను ఆదుకోవడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలిపారు. ప్రతి పక్షాలు ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తున్నారని వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ప్రవీణ్ నాయక్, మాదాపూరు సర్పంచ్ మంద సాయిలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.