అమీర్పేట్ : కొవిడ్ భయాందోళనల నుండి వయోధికులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఈ క్రమంలో ఎస్ఆర్నగర్ వయోధికుల మండలి కార్యనిర్వాహక కార్యదర్శి పెరమాండ్ల లింగమయ్య జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. వయోధికుల మండలి సభ్యులైన ప్రతిఒకరి జన్మదిన వేడుకలను సభ్యులంతా కలిసి నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
కోవిడ్ తరువాత కొంతకాలంగా ఉత్సవాలకు దూరంగా ఉన్న వయోధికుల మండలి కార్యకలాపాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం జరిగిన మండలి కార్యనిర్వాహక కార్యదర్శి పెరుమాండ్ల లింగమయ్య 81వ జన్మదిన వేడుకలను మండలి ప్రతినిధులంతా కలిసి ఉత్సాహంగా నిర్వహించారు.
ఈ వేడుకల్లో అధ్యక్షులు కాసాని సహదేవ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి డి.అనంతరెడ్డి, ప్రతినిధులు మాణిక్రావు పాటిల్, యాదగిరి, సహజ కవి బాల్రాజ్ యాదవ్, ఎల్విఆర్ ప్రభాకర్, రఘురాములు, కోటేశ్వర్రావు, రాజలింగం గౌడ్, నారాయణరెడ్డి, సురేందర్నాయీ, కృష్ణదేవ్ గౌడ్, మాణిక్రావు తదితరులు పాల్గొన్నారు.