భువనగిరి అర్బన్, జనవరి 2 : 18వ రాష్ట్రస్థాయి యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో పాల్గొనేందుకు జిల్లాస్థాయి అండర్-18 బాలబాలికల ఎంపిక పోటీలను భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆదివారం నిర్వహించారు. పోటీలను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పోతంశెట్టి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. అండర్-18 బాలబాలికలకు 100, 200, 400, 800, 1500మీ రన్నింగ్, షార్ట్‌పుట్, డిస్కస్‌త్రో విభాగాల్లో పోటీలు నిర్వహించారు. రన్నింగ్‌లో చౌటుప్పల్‌కు చెందిన నిఖిత 1500మీ, మల్లిక 3వేలు, అశ్విని 100మీ. విభాగంలో ఎంపికయ్యారు. షార్ట్పుట్లో ఆలేరుకు చెందిన సుప్రియ, వలిగొండకు చెందిన యశశ్విని ఎంపికయ్యారు. బాలుర విభాగంలో తుర్కపల్లికి చెందిన ఎం.రాకేశ్ 800మీ., జశ్వంత్ 1500, సంజయ్ 400, సేనాపతి 100, మోత్కూర్‌కు చెందిన శ్రీను 400, భువనగిరికి చెందిన ప్రదీప్ 200మీ. రన్నింగ్, మనోజ్ షార్ట్‌పుట్, నగేశ్ డిస్కస్‌త్రో పోటీల్లో ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 9న ఉదయం 6గంటలకు గచ్చిబౌలిలో రిపోర్టు చేయాలని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి గోపాల్ తెలిపారు. క్రీడాకారులు ఒరిజనల్ వయస్సు ధ్రువీకరణ పత్రం, ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టుతో రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకావాలని సూచించారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కోశాధికారి గోనూరు శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు మాటూరి వినోద్, సంయుక్త కార్యదర్శి ఎర్ర యాదగిరి, సాంకేతిక అధికారులు సాయికిరణ్, మల్లారెడ్డి, ప్రదీప్, సాయికుమార్, మహేశ్, పవన్‌కల్యాణ్, సభ్యులు ఐలయ్య, కబీరుద్దీన్, నిర్మల, వేణు, కుమార్ వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.