శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో ఐ ఫోన్లు పట్టుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వివరాల ప్రకారం… షార్జానుంచి ఓ ప్రయాణీకుడు జి9-458 విమానం లో హైదరాబాద్ వచ్చాడు. అతనిపై అనుమానం రాగా అతని వెంట తెచ్చిన బ్యాగేజిని తనిఖీ చేశారు.
అందులో 9 ఐఫోన్లు అక్రమంగా తరలించేందుకు యత్నించినట్లు అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకొన్నారు. వాటి విలువ 8.37 లక్షలు. ఈ మేరకు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.