మోత్కూరు, జనవరి 3 : మహిళలకు చదువు నేర్పి వారి చైతన్యానికి పునాదులు వేసిన సావిత్రీబాయి పూలే కృషి అమోఘమని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ మందుల సామేల్ అన్నారు. ప్రజాభారతి సాహితీ, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య భవనంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని సావిత్రీబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు సమాజానికి వెలుగు దివ్వెలని, వారికి గౌరవం లభించినప్పుడే మేలు జరుగుతుందని అన్నారు. అనంతరం 14 మంది మహిళా ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తీపిరెడ్డి సావిత్రీమేఘారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కల్వల ప్రకాశ్‌రాయుడు, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు భాస్కరాచారి, ప్రజాభారతి సంస్థ నిర్వాహకులు టి.ఉప్పలయ్య, ఎం.జయశ్రీ, ఎస్ఎన్ చారి, జి.వెంకటేశ్వర్లు, వెంకన్న పాల్గొన్నారు.
సావిత్రీబాయి సేవలు
భువనగిరి అర్బన్ దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా పేదలు, మహిళల విద్యాభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి సావిత్రీబాయి పూలే అని ఎంపీపీ నరాల నిర్మలావెంకటస్వామి అన్నారు. సావిత్రీబాయి 191వ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ, బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ సావిత్రీబాయి పూలే మహిళల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతో కృషి చేశారన్నారు. బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బీరు మల్లయ్య, వైస్ ఎంపీపీ ఏనుగు సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ నల్లమాస రమేశ్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొలుకుల అమరేందర్, మండల కన్వీనర్ కంచి మల్లయ్య, టీఆర్ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు ఏవీ కిరణ్‌కుమార్‌రెడ్డి, జనగాం పాండు, ప్రధాన కార్యదర్శులు రచ్చ శ్రీనివాస్‌రెడ్డి, నీల ఓంప్రకాశ్‌గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త నర్సింహస్వామి, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి అశోక్, నాయకులు లక్ష్మీనారాయణ, బాలయ్య, లక్ష్మీనారాయణగౌడ్, రాంచంద్రయ్య పాల్గొన్నారు.
ఐద్వా ఆధ్వర్యంలో.. పట్టణంలో, మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో ఐద్వా ఆధ్వర్యంలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనూరాధ మాట్లాడుతూ విద్యతోనే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మిన సావిత్రీబాయి తన భర్తతో కలిసి 1884 జనవరి 1న పూణెలో తొలిసారిగా బాలికల పాఠశాలను ప్రారంభించారన్నారు. కార్యక్రమాల్లో ఐద్వా మండలాధ్యక్షురాలు కొండమడుగు నాగమణి, నాయకులు కల్లూరి నాగమణి, హైమావతి, కుమారి, అలివేల, సంధ్య, బాలజ్యోతి, స్వప్న, విజయలక్ష్మి, కాలమ్మ, మంజుల, స్వరూప పాల్గొన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బగ్గు నవీన్, గడ్డం వెంకటేశ్ ఆధ్వర్యంలో పట్టణంలో, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వనం రాజు ఆధ్వర్యంలో పద్మావతి ఒకేషనల్ కళాశాలలో సావిత్రీబాయి జయంతి నిర్వహించారు. అదేవిధంగా, విద్యుత్ కార్యాలయంలో, మై ఫ్రెండ్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి చిత్రపటానికి నివాళులర్పించారు.
అడ్డగూడూరు : తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండల కేంద్రంలో సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రీబాయి తన భర్త ద్వారా చదువు నేర్చుకొని సొంతంగా పుణెలో పాఠశాల ఏర్పాటు చేసి మహిళలను తీర్చిదిద్ది దేశానికే చదువుల తల్లిగా మారారని కొనియాడారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు అనంతుల దేవాంజీ, రాచకొండ రమేశ్, అయోధ్య, సోమయ్య, రాములు పాల్గొన్నారు.
వలిగొండ : మండల కేంద్రంలోని శాఖా గ్రంథాలయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రీబాయి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆ సంఘం మండలాధ్యక్షుడు సాయిని యాదగిరి మాట్లాడుతూ మహిళలకు విద్య బోధించిన మొదటి మహిళా గురువు సావిత్రీబాయి అన్నారు. నాయకులు వెంకటరమణ, రమేశ్, భిక్షపతి, శివ, ఆంజనేయులు, పుల్లయ్య, సంతోశ్, రమేశ్, వెంకటేశ్ పాల్గొన్నారు.
ఆర్మీ ఫోర్స్ కళాశాలలో..
బీబీనగర్ : మండలంలోని రాఘవాపురం తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మీ ఫోర్స్ ప్రిపరేటరీ మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రీబాయి జయంతి నిర్వహించారు. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీసంఘం చైర్మన్, బీబీనగర్ జడ్పీటీసీ గోలి ప్రణీతాపింగళ్‌రెడ్డి పాల్గొని సావిత్రీబాయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
యాదాద్రి (ఆలేరు టౌన్) : టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆలేరు పట్టణంలోని సావిత్రీబాయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేశం, నాయకులు బేతి రాములు, ఆడెపు బాలస్వామి, కందుల శ్రీకాంత్, సంతోష్, రాజేశ్, రవి, మురళి, శ్రవణ్, మల్లేశ్, ఫయాజ్, దుర్గేశ్ పాల్గొన్నారు.
రాజాపేట : మండలంలోని పారుపల్లి, పాముకుంట గ్రామాల్లో సావిత్రీబాయి పూలే జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జై భీమ్ ఆదర్శ యూత్ నాయకులు పాల్గొన్నారు.
గుండాల : మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రీబాయి పూలే చిత్రపటానికి ఉపాధ్యాయులు నివాళులర్పించారు. ఉపాధ్యాయులు గిరివర్ధన్, రజిత, స్వప్న, షాహీన్, కవిత, సంతోష, రవి, మహేశ్, శ్రీనివాసులు, సీఆర్పీ లింగయ్య పాల్గొన్నారు.