మైలార్‌దేవ్‌పల్లి : ఆపదలో ఉన్న వారికి తమ వంతుగా తోచిన సహాయం చేయడం ఎంతో సంతృప్తిని ఇస్తుందని హెల్పింగ్ హ్యండ్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.సోమవారం ఆమన్గల్లుకు చెందిన చిన్నారి అఖిల పుట్టినప్పటి నుండి అనారోగ్య సమస్యతో భాదపడుతుంది.లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్‌కోసం తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కూతురి దవాఖాన ఖర్చుల కోసం సహాయం అర్దిస్తున్న తండ్రికి టీఎన్జీవోస్ కాలనీలో ఉన్న హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ తరపున 15వేల రూపాయల నగదును అందజేశారు.
అలాగే శోభ అనే మహిళ కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నదని తెలిసి అమెకు 15 వేల రూపాయల నగదును అందజేశారు. హెల్పింగ్‌హ్యాండ్స్ సభ్యులు మాట్లాడుతూ.. అపదలో ఉన్న పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తోచిన సహాయం చేస్తున్నామని అన్నారు. కరోనా విపత్కర సమయంలో హెల్పింగ్‌హ్యాండ్స్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. కష్టాల్లో ఉన్న పేదల కోసం ఎల్లప్పుడు ముందుంటామని అన్నారు.ఈ కార్యక్రమంలో హెల్పింగ్‌హ్యాండ్స్ సభ్యులు మణికంఠ, పవన్‌రెడ్డి, విశాల్ , గడ్డం రాజు తదితరులుఉన్నారు.