ఎల్బీనగర్ : యాదవుల ఐక్యతకు వేదిక సదర్ సంబురమని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా అన్నారు. కొత్తపేట యాదవ సంఘం అధ్యక్షుడు తోట శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సదర్ సంబురాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా మాట్లాడుతూ యాదవుల ఆత్మగౌరవ ప్రతీక సదర్ సంబురాలని అన్నారు.
ఈ సందర్భంగా దున్నపోతులను సుందరంగా అలంకరించి బ్యాండ్ మేళాలతో యాదవులు నృత్యాలు చేస్తూ ఘనంగా సంబురాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉత్సవ నిర్వాహకులు దున్నపోతులతో వచ్చిన వారికి మెమొంటోలను బహుకరించారు.
ఈ కార్యక్రమంలో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మాజీ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్‌గౌడ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాలరాల్గౌడ్, టీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు తోట మహేష్‌యాదవ్, యాదవసంఘం గౌరవాధ్యక్షుడు తోట కృష్ణయాదవ్, ప్రధాన కార్యదర్శులు దర్గ వెంకటేశ్ యాదవ్, టి. గోపాల్ యాదవ్, కోశాధికారి తోట సురేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.