నిజామాబాద్ సిటీ/ధర్పల్లి/డిచ్పల్లి/సిరికొండ/ ఇందల్వా యి, జనవరి 5 : జిల్లాలో రైతుబంధు సంబురాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రైతువేదికల్లో బుధవారం నిర్వహించిన సంబురాల్లో రైతులు, నాయకులు పాల్గొన్నారు. వారోత్సవాల్లో భాగంగా పాఠశాలల విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస, ముగ్గుల పోటీలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని విస్డం హైస్కూల్లో నిర్వహించిన సంబురాల్లో జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రైతుబంధు పథకం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కవిత, రమణారావు, అంజయ్య, నీలంరెడ్డి, మనోహర్, నాగారావు తదితరులు పాల్గొన్నారు.
ధర్పల్లి మండల కేంద్రంలోని రైతువేదిక ఆవరణలో సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు, మండల కన్వీనర్ పీసు రాజ్‌పాల్‌రెడ్డి, సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్‌రాజ్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హన్మంత్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి ప్రవీణ్, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, బద్దం నడ్పి గంగారెడ్డి, సురేందర్‌గౌడ్, పుప్పాల సుభాష్, మంచుగంటి నరేందర్, గంగారెడ్డి, గోపాల్‌నాయక్, శ్రీనివాస్‌నాయక్, శివరాం, వెంకట్, బాలు, హెచ్ఎం నారాయణ, ఏఈవో లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
డిచ్పల్లి మండలం నడిపల్లి రైతువేదికలో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. రైతువేదిక ఆవరణలో విద్యార్థినులు రంగురంగుల ముగ్గులు వేశారు. అధికారులు, రైతులు విద్యార్థినులను అభినందించారు. ఏవో రాంబాబు, ఏఈవో రూపేశ్, రైతులు అంజయ్య, సాయన్న పాల్గొన్నారు.
సిరికొండ మండలం హుస్సేన్‌నగర్‌లో రైతుబంధు సమితి గ్రామ కో-ఆర్డినేటర్ మోతె చిన్నారెడ్డి, సర్పంచ్ లక్ష్మి ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సారెడ్డి, దూమాల గంగారెడ్డి, ఉపసర్పంచ్ దేవేందర్‌రెడ్డి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
గడ్కోల్లోని రైతువేదికలో నిర్వహించిన సంబురాల్లో జిల్లా వ్యవసాయాధికారి మేకల గోవింద్ పాల్గొన్నారు. అనంతరం గ్రామ పరిధిలో సాగవుతున్న పొద్దుతిరుగుడు పంటను రైతులతో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకటలక్ష్మి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ మలావత్ మంజుల, జడ్పీటీసీ మలావత్ మాన్సింగ్, సొసైటీ చైర్మన్ మైలారం గంగారెడ్డి, సర్పంచ్ రాచకొండ దేవాగౌడ్, ఎంపీటీసీ గంగారాం, ఏవో వెంకటేశ్, ఏఈవోలు, రైతులు పాల్గ్గొన్నారు.
ఇందల్వాయి మండల కేంద్రంలోని రైతువేదికలో రైతు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ఎంపీపీ రమేశ్‌నాయక్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, జడ్పీటీసీ గడ్డం సుమనారవిరెడ్డి, వైస్ ఎంపీపీ భూసాని అంజయ్య హాజరయ్యారు. పంటసాగుకోసం పెట్టుబడి సహాయాన్ని అందజేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. అనంతరం స్వీట్లు పంచిపెట్టారు. రైతుసంక్షేమానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి మరువలేనిదని అన్నారు. కార్యక్రమంలో సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మోహన్‌నాయక్, సర్పంచులు నరేశ్, తేలు విజయ్‌కుమార్, అంబర్‌సింగ్, చందర్‌నాయక్, ఎంపీటీసీలు మారంపల్లి సుధాకర్, చింతల దాస్, బాబురావు, శ్రీనివాస్, లావణ్య, రవి, మండల వ్యవసాయాధికారిణి స్వప్న, ఏఈవో ప్రకాశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.