
నల్లగొండ, డిసెంబర్ 28 : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జడ్పీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలను బలోపేతం చేయడంతో విద్యార్థుల అడ్మిషన్లు భారీగా పెరిగాయని, అదేవిధంగా ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతున్నట్లు తెలిపారు. నూతన జిల్లాల ఆధారంగా స్థానికతను దృష్టిలో పెట్టుకొని బదిలీలు జరుగుతున్నందున అందరికీ న్యాయం జరుగుతున్నదని పేర్కొన్నారు. పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నయ్య, అంజిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ల ఆధారంగా పోస్టింగ్ ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. నూతన జోనలైజేషన్లో భాగంగానే ఉద్యోగులతో పాటు ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతున్నదని తెలిపారు. 317 జీఓ ఆధారంగా జరుగుతున్న బదిలీలను పీఆర్టీయూ స్వాగతిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మల్లికార్జున్, నర్సింహ, అబ్దుల్లా పాల్గొన్నారు.