గోల్నాక : ఉన్నత చదువులో రాణిస్తున్న రేష్మను నేటి విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. ఆదివారం గోల్నాక డివిజన్ జైస్వాల్గార్డెన్ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఈఎన్టీ స్పెషలైజేషన్‌లో టాపర్‌గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించిన అదే ప్రాంతానికి చెందిన రేష్మ అభినందన సభ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ రేష్మను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రేష్మ భవిష్యత్తులో కూడా మరెన్నో విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఓయూ టాపక్గా నిలవడం అంబర్‌పేటకే గర్వగారణమన్నారు.
ఈ కార్యక్రమంలో జైస్వాల్ గార్డెన్ రెసిడెన్స్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు చింతల శ్రీనివాస్ ముదిరాజ్, ఎన్.రమేశ్ గౌడ్, వినోద్‌కుమార్, వెంకటేశ్‌గౌడ్, రాముగౌడ్, వల్లభ్, ప్రసన్న, ఆంజనేములు తదితరులు పాల్గొన్నారు.