ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ లా ఫ్యాకల్టీలో కేటగిరీ – 1 కింద పీహెచ్డీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
ఈ కేటగిరీ కింద దరఖాస్తు చేసుకునేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) – జూనియర్ రీసర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) సాధించిన వారితో పాటు ఇతర సంస్థల నుంచి జాతీయ ఫెలోషిప్ సాధించిన వారు అర్హులని ఓయూ లా ఫ్యాకల్టీ డీన్ ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తెలిపారు.
ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఓయూ ప్రెస్ నుంచి దరఖాస్తు ఫారం తీసుకుని, సంబంధిత పత్రాలతో కలిపి తమ కార్యాలయంలో వచ్చే నెల 22వ తేదీలోగా దాఖలు చేయాలని చెప్పారు. ఇతర వివరాలకు 040 – 27611245 నెంబర్లో సంప్రదించాలని సూచించారు.