
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఒకరోజు 100 ట్రాక్టర్లకు సర్వీస్ చేయడమే గొప్ప వి షయం. అలాంటిది ఏకంగా 1,818 ట్రాక్టర్లకు సర్వీసును అం దించి మహబూబ్‌నగర్ శ్రీ జయరామ ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 148 మంది సిబ్బంది ఉమ్మడి జిల్లాలోని రైతుల వద్దకు చేరుకొని 1,818 ట్రాక్టర్లకు సర్వీస్‌ను అందించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ మేరకు శ్రీరామ జయరామ సంస్థల అధినేత బెక్కరి రాంరెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు రికార్డు పత్రాన్ని అందజేశారు. ఒకే రోజు 2,500 ట్రాక్టర్ల లక్ష్యానికిగానూ 1,818 ట్రాక్టర్లకు సర్వీస్ చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లోకి ఎక్కడం సంతోషంగా ఉందని బెక్కరి రాంరెడ్డి తెలిపారు. పొలాల వద్దకే వెళ్లి సర్వీస్‌ను ఇస్తున్నందుకు సంస్థ సిబ్బందిని అభినందించారు. ప్రపంచంలోనే నెంబర్‌వన్ ట్రాక్టర్ కంపెనీ యజమాని అయిన ఆనంద్ మహీంద్రా ఆలోచనలు సైతం ఎప్పుడూ రైతులకు మే లు చేయాలనే విధంగా ఉంటాయన్నారు. 1984 నుంచి 31 వేల ట్రాక్టర్లను విక్రయించడమే కాకుండా అత్యున్నత సర్వీస్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మహీంద్రా ట్రాక్టర్స్ జోనల్ కస్టమర్ కేర్ మేనేజర్ గొరిటి శ్రీనివాస్, ఏరియా మేనేజర్ వంశీ కృష్ణారెడ్డి, సిబ్బంది మధు, విన య్ రాథోడ్ సింగ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు కోనేటి రా జు, ఎస్.గోపాల్, జయరామ సేల్స్ మేనేజర్ రాజమూర్తి, సర్వీస్ మేనేజర్ రామకృ ష్ణ, సంస్థ సీఈవో విక్రం యాదవ్, సిబ్బంది వేణుగోపాల్‌రెడ్డి, రాందాస్, ఉ ద్యోగులు, కార్మికులు ఉన్నారు.