
జడ్చర్ల టౌన్, డిసెంబర్ 10 : సంప్రదాయ సాగుపై ఆధారపడకుండా ఇతర పంటలపై దృ ష్టి సారించిన రైతు లాభాలు ఆర్జిస్తున్నాడు. జ డ్చర్ల మండలం ఉదండాపూర్ గ్రామానికి చెం దిన రైతు ఆంజనేయులు తన పొలంలో వరి, మొక్కజొన్న సాగు చేసేవాడు. ఎప్పుడూ ఒకే రకమైన పంట పండించడంతో పెట్టుబడికి సరిపడా దిగుబడి కూడా రాకపోయేది. అంతే కా కుండా ఈ పంటలకు నీటి వినియోగం కూడా ఎక్కువ ఉంటుంది. దీంతో వరికి బదులు ఇత ర పంటలే మేలని భావించాడు. ఈ క్రమంలో ఉదండాపూర్ గ్రామంలో తన పొలాన్ని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ భూ సేకరణలో ముంపునకు గురైంది. అయినా, ఆంజనేయు లు వ్యవసాయాన్ని వదిలిపెట్టకుండా జడ్చర్లలో జాతీయ రహదారి పక్కన 15.5 ఎకరా ల భూమిని కౌలుకు తీసుకున్నాడు. 20 ఏం డ్లుగా సంప్రదాయ పంటలు సాగు చేస్తూ వ చ్చిన ఆయన కూరగాయలతోపాటు పూల సా గుపై దృష్టి సారించాడు. 8 ఎకరాల్లో మొక్కజొన్న, 6 ఎకరాల్లో వరి పండిస్తూనే.. ఎకరన్నరలో బంతి, చామంతి, కనకంబరం పూల తో టను సాగు చేస్తున్నాడు. వరి, మొక్కజొన్న పంటలకు పెట్టిన పెట్టుబడికి సరిపడా దిగుబడి రావడం లేదని వాపోతున్నాడు. కానీ, పూల తోట సాగుకు అధిక దిగుబడి వస్తున్నదని ఆం జనేయులు చెబుతున్నాడు. ఇటీవల బంతి, చామంతి పూలకు మార్కెట్లో కిలో రూ.150 వరకు ధర పలుకుతున్నది. అంతేకాకుండా కొనుగోలుదారులే తోట వద్దకు వచ్చి పూలు కొనుగోలు చేస్తుండడంతో మార్కెటింగ్‌కు కూ డా ఇబ్బంది లేదని అంటున్నాడు. పూల తోట ను ఒక్కసారి సాగు చేస్తే.. మూడు సార్లు పంట చేతికొస్తుంది. వరి బదులు కూరగాయలు, పూ లసాగే మేలని చెబుతున్నాడు.
అధిక లాభాలు వస్తున్నాయి..
సాగునీటి వనరులు లేనందున వర్షాధారంపైనే వరి, మొక్కజొన్న పండిస్తుండడంతో పెట్టుబడికి సరిపడా దిగుబడి రావడం లేదు. దీంతో వ్యవసాయాధికారుల సూచనలతో కూరగాయలు, పూలసాగుపై దృష్టి సారించాను. పూలసాగు కోసం వారానికోసారి నీటి వినియోగం ఉంటుంది. కిలో రూ.150 పలుకుతున్నది. కిలోకు కనీసం రూ.100 వచ్చినా రైతుకు లాభమే. విత్తనం నాటిన మూడు నెలల్లో పూలు చేతికొస్తాయి. మార్కెట్లో డిమాండ్ ఉండడంతో అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. స్థానిక వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొంటున్నారు. సీజన్ లేనప్పుడు హైదరాబాద్ మార్కెట్‌కు తరలిస్తాను.