
తల్లాడ, డిసెంబర్19 : తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేయడాన్ని నిరసిస్తూ సోమవారం ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. టీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు బొడ్డు వెంకటేశ్వరరావు గృహంలో ఆదివారం నిర్వహించిన టీఆర్ఎస్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గంలో నిరసనలు చేపట్టాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి గ్రామ, మండల కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగే నిరసన కార్యక్రమాలకు రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు హాజరై విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, నారపోగు వెంకట్, శీలం కోటారెడ్డి, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, బద్ధం కోటిరెడ్డి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, కేతినేని చలపతిరావు, షేక్ ఈసూబ్, జొన్నలగడ్డ కిరణ్‌బాబు, జీ.వీ.ఆర్, గుండ్ల వెంకటి, పెరిక నాగేశ్వరరావు, శీలం శ్రీనివాసరెడ్డి, కంపాటి శశికుమార్, పమ్మి కృష్ణారావు, ఓబుల సీతారామిరెడ్డి, ముత్తారెడ్డి పాల్గొన్నారు.
సత్తుపల్లి, డిసెంబర్ 19 : ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసేంతవరకు పోరాటాలు నిర్వహించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు రైతులకు పిలుపునిచ్చారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో రైతులు నల్లచొక్కాలు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ, మోదీ దిష్టిబొమ్మలను దహనం చేయాలని అన్నారు. పంజాబ్ రైతుల వలే తెలంగాణ రైతులు కూడా ఉద్యమించాలన్నారు. కూసంపూడి మహేశ్, దొడ్డా హైమావతి శంకర్రావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి రామారావు, చల్లగుళ్ల కృష్ణయ్య, చిలుకుర్తి కృష్ణమూర్తి, మందపాటి వెంకటరెడ్డి, విస్సంపల్లి వెంకటేశ్వరరావు, తుమ్మూరు కృష్ణారెడ్డి, రఫీ, అంకమరాజు, సుజలారాణి, గాదె సత్యం, శ్రీధర్‌రెడ్డి, కంచర్ల నాగేశ్వరరావు, మోరంపూడి శ్రీను, మోదుగు పుల్లారావు, రామ్మోహనరెడ్డి, మట్టా ప్రసాద్, కాలినేని వెంకటేశ్వరరావు, కొడిమెల అప్పారావు, జానకిరామ్, కొప్పుల నరేందర్‌రెడ్డి, సతీశ్‌రెడ్డి పాల్గొన్నారు.
నేడు కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా
కొణిజర్ల, డిసెంబర్19 : మిర్చి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట జరిగే రైతుల ధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. లాలాపురంలో మిర్చి పంటను సీపీఎం, రైతు సంఘం నాయకులు ఆదివారం పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమంలో భూక్యా వీరభద్రం, తాళ్లపల్లి కృష్ణ, చింతనిప్పు చలపతిరావు, సంక్రాంతి నర్సయ్య, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.