
మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 28: సౌత్‌జోన్ బాస్కెట్‌బాల్ టోర్నీలో పీయూ జట్టు సత్తాచాటాలని పీయూ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ లక్ష్మీకాంత్‌రాథోడ్ పేర్కొన్నారు. కర్ణాటక క్రిస్ట్ యూనివర్సిటీలో ఈ నెల 30నుంచి జనవరి 4వరకు జరగనున్న ఇంటర్ యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ సౌత్‌జోన్ టోర్నీలో పాల్గొనేందుకు పాలమూరు యూనివర్సిటీ పురుషుల జట్టు తరలివెళ్లింది. మంగళవారం పీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జట్టును వీసీ అభినందించారు. వీసీ మాట్లాడుతూ క్రీడాకారులకు బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. క్రీడాకారులకు అన్ని విధాలా అండగా ఉంటామ ని, పీయూలో క్రీడాభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో వోఎస్డీ మధుసూదన్‌రెడ్డి, పీడీ బాల్‌రాజ్‌గౌడ్, కోచ్ మేనేజర్లు ఖలీల్, కతలప్ప, ఇలియాజ్ పాల్గొన్నారు.
పీయూ పురుషుల జట్టు వివరాలు
ఆంజనేయులు, కిరణ్, సయ్యద్‌అలీ, ఆదిశేషు, సందీప్, అఖిల్, ప్రశాంత్, ప్రభాకర్, అబ్దుల్హ్రీం, నాగరాజు, అశోక్, రవి.సెమీస్‌కు చేరిన పీయూ హాకీ జట్టు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూర్ యూనివర్సిటీలో జరుగుతున్న సౌత్‌జోన్ హాకీ టోర్నీలో పీయూ పురుషుల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. మంగళవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్ యోగి వేమన యూనివర్సిటీపై 3-2 స్కోర్ తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. పీయూ జట్టు సెమీస్‌కు చేరడంపై వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్‌రాథోడ్, రిజిస్ట్రార్ పిండి పవన్‌కుమార్, వోఎస్డీ మధుసూదన్‌రెడ్డి, పీయూ పీడీ బాలరాజ్‌గౌడ్ జట్టును అభినందించారు. ఆలిండియా పోటీల్లో పాల్గొనడమే లక్ష్యంగా ముందుకెళ్లాలన్నారు.
క్రాస్‌కంట్రీ టోర్నీలో ప్రతిభ
కరీంనగర్ జిల్లాలో జరిగిన అంతర్ జిల్లాల (క్రాస్ కంట్రీ) టోర్నీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటారు. మహిళలు 10కిలోమీటర్ల పరుగు పందెంలో మహేశ్వరి వెండి పత కం, అంజలి ఆరోస్థానంలో నిలిచారు. జిల్లా అధ్యక్షుడు టోనిమార్టిన్, కార్యనిర్వాహక కార్యదర్శి ఆనంద్‌కుమార్, కోచ్‌లు సాధిక్‌అలీ, సునీల్‌కుమార్ అభినందించారు.