చాదర్‌ఘాట్ :టెమ్రీస్ సైదాబాద్ బాలుర-1 స్కూల్లో హౌసింగ్ కీపింగ్ స్వీపర్‌గా పనిచేసి మృతి చెందిన బాధితురాలి కుటుంబానికి ప్రిన్సిపల్ విద్యాసాగర్ ఆర్థిక సహాయం అందజేశారు. గురువారం స్కూల్లో జరిగిన కార్యక్రమంలో స్వీపర్ మరియంబీ కుటుంబ సభ్యులకు రూ.15వేల నగదును అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విద్యాసాగర్ మాట్లాడుతూ మరియంబీ గుండెపోటుతో మృతి చెందడంతో స్కూల్లోని సిబ్బంది అందరూ కలిసి రూ.15 వేల నగదును అందజేసినట్టు తెలిపారు. మృతురాలి కుటుంబానికి ఆర్థిక చేయూత అందించేందుకు తమవంతుగా సహాయం చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు సునితా, నజాం, అమ్రీన్, వార్డెన్ హకీం, హరీశ్, గౌసుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.