ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు వనపర్తి జిల్లాగా మారడంతో దశ మారింది. హామీలను
అమలు చేయడంతో అభివృద్ధిలో పరుగులు పెడుతున్నది. మాట తప్పకుండా అభివృద్ధికి వేలాది కోట్లు మంజూరు చేయడంతో జిల్లా ముఖచిత్రమే మారిపోయింది. మెడికల్ కళాశాల, నర్సింగ్ కాలేజీ, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులు.. ఇలా అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. ఒకప్పుడు బీడువారిన నేలలు నేడు పచ్చటి దుప్పటి పరిచినట్లు కళకళ లాడుతున్నాయి. ధాన్యం రాశులతో కల్లాలు మిలమిల లాడుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో వనపర్తి నుంచి ప్రాతినిథ్యం వహించిన టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉండి చేయలేని అభివృద్ధిని చేసి చూపించారు.
వనపర్తి, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ప్రభుత్వంలో వనపర్తి వైభవానికి పునరుజ్జీవం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయడంతో అభివృద్ధిలో వనపర్తి పరుగులు పెడుతున్నది. ఎన్నికల్లో హామీలు ఇచ్చి మరిచిపోవడం కాకుండా ప్రత్యేక దృష్టి సారించి నిధులు మంజూరుచేసి ప్రగతి బాటలు వేశారు. వీటిని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సద్వినియోగం చేసుకుంటూ వనపర్తి జిల్లాను కనీవినీ ఎరుగని రీతిలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఇచ్చిన హామీలే కాకుండా అనేక అభివృద్ధి పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి మంత్రి నిధులు తీసుకువచ్చారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్నట్లు జిల్లా మొత్తం సస్యశ్యామలంగా తయారైంది.
జలకళ
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వనపర్తిలో సాగు, తాగునీటికి ఢోకా లేకుండా పోయింది. వరుసగా కరువు కాటకాలు వచ్చినా నీటి కటకట ఉండవద్దనే లక్ష్యంతో ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టారు. ఏడాది పొడవునా నిండుకుండల్లా చెరువులు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఏడు టీఎంసీల సామర్థ్యంతో ఏదుల రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేశారు. ఇటీవలే కర్నెతండా ఎత్తిపోతల పథకానికి సీఎం కేసీఆర్ రూ.76.20 కోట్లు మంజూరు చేశారు. ఈ లిఫ్టును సీఎం కేసీఆర్ స్వయంగా శంకు స్థాపన చేయనున్నారు. కర్నెతండా ఎత్తిపోతల పథకం వల్ల అనేక గిరిజన తండాలకు సాగునీరు అంది ప్రయో జనం కలుగనుంది. అందులో కర్నెతండా, పూల్‌సింగ్ తండా, హన్మ్యాతండా, చిన్నపీర్ తండా, ఆముదం బండ తండా, భీముని తండా, దొంతికుంట తండా, రుక్కన్నపల్లి తండా, పోతులకుంట తండా, జంగమా యపల్లి తండా, జంగమాయపల్లి తండా, ఎర్రగడ్డ తండా, మేడిగడ్డతండా, గార్లబండ తండా, పెద్దమం దడి మండలం, ఘనఫురం మండలం, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలాల్లోని 8గ్రామా లు, 15గిరిజన తండాలకు సాగునీరు అందనుంది.
భవిష్యత్ ప్రణాళిక
వనపర్తి నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్, గణప సముద్రం, ఘణపురం, ఎర్రగట్టు రిజర్వాయర్, బుద్ధారం స్టేజ్1, స్టేజ్ 2 రిజర్వాయర్లు, కిష్టాపూర్ రిజర్వాయర్లకు త్వరలో ఆమోదం పొందనున్నది. గతంలో పనులు చేపట్టిన రిజర్వాయర్ల ద్వారా ప్రతి మండలంలో ఒక టీఎంసీని నిలువ ఉంచి స్థానిక అవసరాల నిమిత్తం వాడుకునేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. వీటికి త్వరలో ఆమోదం లభించనున్నది. ఎత్తైన ప్రాంతంలో ఉన్న కాశీంనగర్, కాశీంనగర్ తండా, దత్తాయిపల్లి, దత్తాయిపల్లి తండాలకు సాగునీరు అందించేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రతిపాదించిన కిష్టాపూర్ రిజర్వాయర్ వద్ద మినీ లిఫ్ట్ ద్వారా దాదాపు 1500 ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
చెక్‌డ్యాంల నిర్మాణం
మొదటిదశలో ఇప్పటికే జగత్పల్లి వాగుపై రెండు, చిట్యాల వాగుపై రెండు, ఘణపురం మండలం వెంకట్రాంపల్లి వాగు మీద ఒక చెక్‌డ్యాం, ఇప్పటికే పూర్తిచేశారు. రెండోదశలో రాజనగరంలో ఒకటి, కడుకుంట్లలో ఒకటి, చిమనగుంటపల్లి వాగుమీద రెండు, సల్కెలాపురంలో ఒకటి, వెల్టూరులో ఒకటి, చిల్కటోని పల్లెలో ఒకటి, అప్పారెడ్డి పల్లెలో ఒకటి, కర్నెతండాలో ఒక చెక్‌డ్యాం నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేశారు. వనపర్తి నియోజకవర్గంలోని వాగుల మీద ఎక్కడికక్కడ వంద చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.
కెనాల్స్ భళా
సీఎస్ఆర్ నిధులతో మినీ లిఫ్టులు
ఎత్తైన ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్రంలో తొలిసారి సీఎస్ఆర్ (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) నిధులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీతోపాటు మంత్రి నిరంజన్‌రెడ్డి స్వంత నిధులతో మొత్తం రూ.7కోట్లు వెచ్చించి దాదాపు 60మినీ ఎత్తిపోతల పథకాలతో 5వేల ఎకరాలకు సాగునీరు అందించారు.
మౌలిక సౌకర్యాలకు..