రైతుబంధు వారోత్సవాలు ఉమ్మడి జిల్లాలో పండుగలా కొనసాగుతున్నాయి. రైతువేదికలు, విద్యాసంస్థల్లో సంబురాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 10వ తేదీ నాటికి రైతుబంధు పథకం ద్వారా పంపిణీ చేసిన పెట్టుబడిసాయం రూ.50వేల కోట్లకు చేరుతుండడాన్ని యావత్ రైతాంగం హర్షిస్తున్నది. బుధవారం ఉమ్మడి జిల్లాలోని రైతులు పెద్దఎత్తున రైతువేదికల వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. రంగ వల్లులతో రైతుబాంధవుడికి మహిళలు జేజేలు పలికారు.
రైతుబంధు వారోత్సవాలు ఊరూరా పండుగలా కొనసాగుతున్నాయి. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రైతులు, నాయకులు బుధవారం క్షీరాభిషేకం చేశారు. విద్యాసంస్థల్లో విద్యార్థులకు ముగ్గులు, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. పొలాల్లో ఉన్న రైతులు సైతం రైతుబంధు ఉత్సవాల్లో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. రైతుబాంధవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు.