
వేంసూరు, డిసెంబర్ 23 : సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని, సర్వమతాలకు సముచిత స్థానం కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో గురువారం క్రిస్మస్ కానుకలను పంపిణీ చేసి మాట్లాడారు. అనంతరం లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందజేశారు. వ్యవసాయ శాఖ బ్రోచర్, పుస్తకాలను విడుదల చేసి రైతులకు సూచనలు చేశారు. మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు, మర్లపాడు సర్పంచ్ మందపాటి వేణుగోపాల్‌రెడ్డిని పరామర్శించారు. పగుట్ల వెంకటేశ్వరరావు, మారోజు సుమలత, దొడ్డా శ్రీలక్ష్మీ, గొర్ల సంజీవరెడ్డి, వెల్ది జగన్మోహన్రావు, పుచ్చకాయల శంకర్‌రెడ్డి, వీరేశం, ముజాహిద్, అశోక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
కల్లూరు, డిసెంబర్ 23 : అన్ని మతాలను గౌరవించే సంప్రదాయం సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గురువారం ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఆయన క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేసి మాట్లాడారు. బీరవల్లి రఘు, పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, బోబోలు లక్ష్మణరావు, సంజీవరావు, కాటంనేని వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, యూనోస్కుమార్, నిర్మల్‌కుమార్, పీడీ.దాస్, క్రైస్తవ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
తల్లాడ, డిసెంబర్ 23 : తల్లాడ రైతువేదికలో అసిస్టెంట్ కలెక్టర్ మధుసూదన్‌రావుతో కలిసి ఎమ్మెల్యే లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో రాయల వెంకటశేషగిరిరావు, తాజుద్దీన్, దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దుగ్గిదేవర వెంకట్‌లాల్, దూపాటి భద్రరాజు, చల్లా తిరుమలదేవి, రుద్రాక్షల బ్రహ్మం, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, శివారెడ్డి, బద్ధం కోటిరెడ్డి, జీ.వీ.ఆర్, దిరిశాల దాసురావు, పెరిక నాగేశ్వరరావు, దగ్గుల రాజశేఖర్‌రెడ్డి, గొల్లమందల పద్మ తదితరులు పాల్గొన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా కొత్తవెంకటగిరి గ్రామానికి చెందిన ఆదర్శ రైతు దిరిశాల వెంకటనర్సయ్యను సన్మానించారు.
ఎమ్మెల్యే సండ్రను కలిసిన ‘కొత్తూరు’
సత్తుపల్లి, డిసెంబర్ 23 : జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్‌గా నియమితులైన సత్తుపల్లినికి చెందిన కొత్తూరు ఉమామహేశ్వరరావు గురువారం ఖమ్మంలో ఎమ్మెల్యే సండ్రను కలిసి శాలువాతో సత్కరించారు. ఆయన వెంట వనమా వాసు, మల్లూరి అంకమరాజు, పసుమర్తి గోపాలరావు, గుండు శ్రీనివాసరావు, మహంకాళి పూర్ణ, దామోదర్ తదితరులు ఉన్నారు. దేశానికి ఆహార ఉత్పత్తులను అందించే రైతు భగవంతుడితో సమానమని ఎమ్మెల్యే సండ్ర అన్నారు.
ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేశాం..
సత్తుపల్లి రూరల్, డిసెంబర్ 23 : ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేశామని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు నియామకంపై సత్తుపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సండ్ర, కొత్తూరులను గజమాలతో ఆర్యవైశ్యులు సత్కరించారు.కూసంపూడి మహేశ్, దొడ్డా హైమావతి, రఫీ పాల్గొన్నారు.ఎమ్మెల్యే ఆధ్వర్యంలోక్యాంపు కార్యాలయంలో గురువారం సెమీక్రిస్మస్ వేడుకలు నిర్వహించారు.
తెలంగాణపై బీజేపీ కుట్ర
పెనుబల్లి, డిసెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై విషం కక్కుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధ్వజమెత్తారు. లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో లక్కినేని అలేఖ్య, రమాదేవి, చెక్కిలాల మోహన్‌రావు, లక్ష్మణ్‌రావు, కావూరి మహాలక్ష్మి, శ్వేత, ముక్కర భూపాల్ రెడ్డి, కనగాల వెంకటరావు, మందడపు అశోక్‌కుమార్, భూక్యా పంతులి, తేజావత్ తావూనాయక్, భూక్యా ప్రసాద్ పాల్గొన్నారు.