
మాదాపూర్ : కొండాపూర్ డివిజన్ 11 కేవీ ఫీడర్ పరిధిలోని ఫలు ప్రాంతాల్లో కరెంట్ వైర్లకు చెట్ల కొమ్మలు అడ్డు రావడంతో అధికారులు వాటిని తొలగించే క్రమంలో ఫలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలగనుంది. ఇందులో భాగంగా గచ్చిబౌలి 11 కేవీ ఫీడర్ పరిధిలో ఆర్ వీ నిర్మాన్ ,ఫార్చున్ కుంకుం, ఏకేహెచ్ అపార్ట్మెంట్స్, కళాజ్యోతి ఏరియా, కల్లు కాంపౌండ్ సర్కిల్, కమ్యూనిటీ హల్ వెనకాల వైపు ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుండి మద్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ నిలిపివేస్తారు.
గచ్చిబౌలి మెజిక్యుటీ 11 కేవీ ఫీడర్ పరిధిలో రాజ ప్రసాదం ఏరియా, ఐఎన్ అపార్ట్మెంట్, శ్రీరాం నగర్ సి బ్లాక్, డీసిఎల్ లే అవుట్, ఆదర్శ్ కో ఆపరేటివ్ బ్యాంకు వనకాల వైపు టవర్ లైన్ రోడ్డు ప్రాంతాల్లో మద్యాహ్నం 1:30 గంటల నుండి 4:30 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం కలగనుందని కొండాపూర్ ఏఈ రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు.