
తల్లాడ, జనవరి 9 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఆర్థికంగా ఎంతో మెరుగుపడ్డారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కలకొడిమ, కుర్నవల్లి, ముద్దునూరు, రామానుజవరం, మిట్టపల్లి, నూతనకల్, అంజనాపురం గ్రామాల్లో రైతులు ఆదివారం ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. కలకొడిమలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావుతో కలిసి ఎమ్మెల్యే ర్యాలీని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు పెట్టుబడి సాయం ఇతర పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏడేళ్ల పాలనలో తెలంగాణ రైతు రాష్ట్రంగా మార్చి రైతుకు భరోసాగా నిలిచారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇటువంటి పథకాలను ప్రవేశపెట్టలేదన్నారు. మిట్టపల్లిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో దొడ్డా శ్రీనివాసరావు, దిరిశాల ప్రమీల, దుగ్గిదేవర వెంకట్‌లాల్, రెడ్డెం వీరమోహన్‌రెడ్డి, దూపాటి భద్రరాజు, దిరిశాల దాసురావు, అయిలూరి ప్రదీప్‌రెడ్డి, అయిలూరి లక్ష్మి, శీలం కోటారెడ్డి, ఓబుల సీతారామిరెడ్డి, ఆదూరి వెంకటేశ్వర్లు, శీలం శివపార్వతి, తూము శ్రీనివాసరావు, కేతినేని చలపతి, నారపోగు వెంకటేశ్వర్లు, ఎం డీ తాజుద్దీన్, జీ వీ ఆర్, బద్ధం కోటిరెడ్డి, రుద్రాక్షల బ్రహ్మం, తూము వీరభద్రరావు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, అయిలూరి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు రైతువేదిక, సొసైటీ కార్యాలయాలు ప్రారంభం
తల్లాడలో నూతనంగా నిర్మించిన రైతువేదిక, సొసైటీ కార్యాలయాల ప్రారంభోత్సవం సోమవారం నిర్వహించనున్నట్లు ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం తల్లాడలో జరగబోయే అధికారిక కార్యక్రమాల పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించి సూచనలు చేశారు.
మంత్రుల పర్యటనను జయప్రదం చేయండి : సండ్ర
సత్తుపల్లి, జనవరి 9 : రైతుబంధు సంబురాల్లో భాగంగా సోమవారం నారాయణపురంలో రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే సండ్ర పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన నారాయణపురంలో మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. కార్యక్రమానికి మండల పరిధిలోని రైతులు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు హాజరు కావాలని కోరారు. ఆయన వెంట శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, కూసంపూడి రామారావు, దేశిరెడ్డి రంగారెడ్డి, మందపాటి వెంకటరెడ్డి, తుమ్మూరు కృష్ణారెడ్డి, కూసంపూడి మహేశ్, పాల వెంకటరెడ్డి, పగుట్ల వెంకటేశ్వరరావు, పవన్, రవీందర్‌రెడ్డి, ఆనంద్ తదితరులు ఉన్నారు.
కల్లూరు, జనవరి 9 : రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి కల్లూరు మండల పర్యటనను జయప్రదం చేయాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు ఆదివారం పిలుపునిచ్చారు. సోమవారం చెన్నూరు లో నూతనంగా నిర్మించిన సొసైటీ భవనాన్ని మంత్రి సింగిరెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య హాజరవుతారని తెలిపారు.
గ్రామాల్లో మహిళలకు ముగ్గుల పోటీలు
వేంసూరు, జనవరి 9 :రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రామన్నపాలెంలో సర్పంచ్ షేక్ నాగుల్‌మీరా ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి సర్పంచ్ బహుమతులు అందజేశారు. గ్రామశాఖ అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు పాల్గొన్నారు.
రైతుబంధు వారోత్సవాలు
వైరా, జనవరి 9 : మండలంలోని పలు గ్రామాల్లో రైతులు రైతుబంధు ముగ్గులు వేసి రంగవల్లులు అద్దారు. గరికపాడు పీఏసీఎస్‌లో నిర్వహించిన రైతుబంధు సంబురాలను ఆ సంఘం అధ్యక్షుడు ఐలూరి కృష్ణారెడ్డి ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోలు పథకాలు రైతులకు ఉపయోగపడేలా ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎలిషా, మండల వ్యవసాయాధికారి పవన్, ఏఈవోలు సైదులు, కీర్తి, గరికపాడు సంఘ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.