భద్రాచలం, జనవరి 6: రైతు బంధు సంబురాల్లో భాగంగా గురువారం వివిధ గ్రామాల్లో పాఠశాలల విద్యార్థులకు గురువారం వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారి సుధాకర్‌రావు, ఏవో అనీల్, హెచ్ఎం నీరజ, పశు వైద్యాధికారి రవీంద్రనాథ్ టాగోర్, ఏఈవో రమాదేవి పాల్గొన్నారు.
మణుగూరు రూరల్‌లో..
మణుగూరు రూరల్, జనవరి 6: మండలంలోని రామానుజవరం పంచాయతీలో ప్రభుదాస్ , తిర్లాపురం పంచాయతీలోని విజయనగర పాఠశాలలో మండల అధ్యక్షుడు ముత్యంబాబు, అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో సమితిసింగారం ఎంపీటీసీ గాజుల రమ్య ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు చెన్నకేశవులు, ప్రవీణ్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రామిడి రామిరెడ్డి, నాయకులు గాండ్ల సురేశ్, మేకల రవి, కర్ల వెంకన్న, గాజుల నరేశ్, పాఠశాల హెచ్ఎం కిశోర్‌కుమార్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం మండలంలో..
దుమ్ముగూడెం, జనవరి 6: మండలంలోని నర్సాపురం జిల్లా పరిషత్, దుమ్ముగూడెం కేజీబీవీ, కొత్తపల్లి, రేగుబల్లి ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు గురువారం వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు రైతుబంధు సమితి మండల కన్వీనర్ బత్తుల శోభన్‌బాబు, ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, సిబ్బంది, ఏఈవోలు అలేఖ్య, రైతుబంధు సమితి సభ్యుడు వీరమాచినేని కోటేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
చర్ల మండలంలో..
చర్ల, జనవరి 6: చర్లలోని జిల్లాపరిషత్ బాలికల ఉన్న త పాఠశాల, సత్యనారాయణపురం ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గులు, డ్రాయింగ్, పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి సభ్యురాలు గుమ్మడి నవభారతి, సత్యనారాయణపురం సర్పంచ్ పుల్లయ్య, బాలికల ఉన్నతపాఠశాల హెచ్ఎం భవాని, టీఆర్ఎస్ నాయకుడు దొడ్డి తాతారావు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బూర్గంపహాడ్ మండలంలో..
బూర్గంపహాడ్, జనవరి 6: మండలంలోని మోరంపల్లిబంజర ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రైతుబంధు అంశంపై వ్యాసరచన పోటీ నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ ఏఈవో ప్రసాద్, హెచ్ఎం కే వెంకటేశ్వర్లు, రైతుబంధు సమితి గ్రామ కన్వీనర్ సుబ్బిరామిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
సారపాకలో..
సారపాక, జనవరి 6: కోయగూడెం పంచాయతీలో సర్పంచ్ తుపాకుల రామలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులు వేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, నాయకులు తుపాకుల రవి, రైతులు పాల్గొన్నారు.
పినపాక మండలంలో…
పినపాక, జనవరి 6: మండలంలోని ఈబయ్యారం రైతువేదికలో నిర్వహించిన రైతుబంధు సంబురాల్లో ఏడీఏ తాతారావు మాట్లాడారు. రైతుబంధు పెట్టుబడిని రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు లక్ష్మణ్‌రావు, రమేశ్, ఐకేపీ ఏపీఎం జ్యోతి, రైతులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.