
కొల్లాపూర్, డిసెంబర్ 10 : నియోజకవర్గంలోని మామిడి రైతుల చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. మామిడి మార్కెట్ కేంద్రం ఏర్పాటుకు మార్గం సుగమమవుతున్నది. మార్కెటింగ్ కో సం అనువైన భూమిని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఆదేశాల మేరకు 4వ తే దీన ఆర్డీవో హనుమానాయక్, తాసిల్దా ర్ చంద్రశేఖర్, మార్కెటింగ్, ఉద్యానవ న శాఖాధికారులు గుర్తించారు. కొల్లాపూర్ మండలం రామాపూర్ (కొల్లాపూర్-పెబ్బేర్ రోడ్డు పక్కన) గ్రామ శివారు లో సర్వే నంబర్ 113/3లో 12 ఎకరా ల ప్రభుత్వ భూమి అనువుగా ఉందని నిర్ణయించారు. ఈ భూమికి సంబంధించిన పత్రాలను శుక్రవారం మార్కెటింగ్ అధికారిణి బాలమణెమ్మకు రెవెన్యూ అధికారులు అప్పగించారు. మార్కెటింగ్‌కు ఎంత విస్తీర్ణం అవసరం, వాహనా ల పార్కింగ్, మామిడి నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు, పెద్ద షెడ్డు ని ర్మాణం, రైతులకు విశ్రాంతితోపాటు తా గునీరు, వసతుల కల్పనకు సంబంధించిన విషయాలను ఎమ్మెల్యే బీరంతో కలిసి ఉద్యానవన శాఖ జిల్లా అధికారి చంద్రశేఖర్, రమేశ్, అధికారులు పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలోనే 25 వేల ఎకరాల్లో మామిడి సాగుతో ముందంజలో ఉన్నదని వారు తెలిపారు. కాగా ఇ క్కడి మామిడిని ఏటా వాహనాల్లో హైదరాబాద్ మార్కెట్‌కు తరలించి దళారుల కు వక్రయించి రైతులు నష్టపోయేవారు. మార్కెటింగ్ కేంద్రం ఏర్పాటైతే రైతులకు వ్యయప్రయాసాలు తప్పడంతోపా టు ధర నిర్ణయించే అవకాశం వెసులుబాటు ఏర్పడనున్నది.
మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే..
కొల్లాపూర్ ప్రాంతంలో మార్కెటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మామిడి రైతుల కష్టాలు తీర్చుతామని గతంలో ఎమ్మెల్యే బీరం హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2న జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ కా ర్యక్రమానికి హాజరైన సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే బీరం కలిశారు. మామిడి రైతు ల కష్టాలు తీర్చేందుకు కేంద్రాన్ని ఏర్పా టు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారం గ డవకముందే మార్కెటింగ్‌కు కావాల్సిన స్థలాన్ని అధికారులు గుర్తించి అధికారులకు అప్పగించడంలో ఎమ్మెల్యే చొరవ తీసుకున్నారు. దీంతో స్థానిక మామిడి రైతులు ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నిరంజన్, పట్టణ అధ్యక్షుడు, మాచినేనిపల్లి విండో చైర్మన్ చింతకుంట శ్రీనివాసులు, డైరెక్టర్ పరశురాంగౌడ్, ఖాదర్‌పాషా, జగన్మోహన్రెడ్డి, రాఘవేంద్ర, గోపాల మల్లయ్య, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు ఫయాజ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అలీబాబా నాయుడు పాల్గొన్నారు.