కాచిగూడ : తల్లిదండ్రులు వదిలిపెట్టి వెళ్లిపోయిన చిన్నారిని అశ్రిత చైల్డ్‌లైఫ్ ప్రతినిధులు చేరదీశారు. కాచిగూడ అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న బస్‌స్టాఫ్‌లో ఓ చిన్నారి ( హేమ -4) ని మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు వదిలి పెట్టి వెళ్లిపోయారు.
ఒంటరిగా ఏడుస్తున్న విషయాన్ని గమనించిన అశ్రిత ప్రతినిధులు ఆ చిన్నారిని చేరదీసి కుటుంబ సభ్యుల వివరాలు అడుగగా చెప్పలేకపోయింది. దీంతో హేమను కాచిగూడ అడ్మిన్ ఎస్సై శ్రీనివాస్ సమక్షంలో యూసుఫ్‌గూడలోని శిశువిహార్ హోంకు తరలించినట్లు అశ్రిత చెల్డ్లైన్ ప్రతినిధులు పేర్కొన్నారు.