
వనపర్తి, డిసెంబర్ 31 (నమస్తే తె లంగాణ)/పెబ్బేరు : పచ్చని పంటలకు ఉమ్మడి పాలమూరు జిల్లా నిలయంగా మారిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలోని ప్రియదర్శిని జూరాల అతిథి గృహ ఆవరణలో సాగునీటి సలహా బో ర్డు సమావేశాన్ని నిర్వహించారు. మం త్రి ముఖ్య అతిథిగా హాజరవగా.. నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అ్ర బహం, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ యాసంగిలో రైతులు ఆ రుతడి పంటలే సాగు చేయాలని సూచించారు. ఇందుకుగానూ ప్రణాళికాబద్ధం గా రిజర్వాయర్లు, లిఫ్టులు, కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వర్కింగ్ సీజన్లో ప్రతిరోజూ క్యాలెండర్ డివైడ్ చే సుకోవాలన్నారు. సాగునీరు ఇవ్వడం అంటే పెద్ద భగీరథ ప్రయత్నమని ప్రతి ఒక్కరూ అనుకున్నారు.. ఆపేక్ష ఉన్నప్పటికీ ఏపీలో అది సాధ్యం కాలేదని చె ప్పారు. ఒక్క జూరాల ప్రాజెక్టును నిర్మించుకుంటే నిర్ధేశించుకున్న ఆయకట్టుకు నీరు అందించలేకపోయామని పేర్కొన్నారు. గత ఆరేడేండ్ల నుంచి మాత్రమే నిర్ధేశించుకున్న ఆయకట్టులోని మొదటి పంటకు నీరందించి రెండో పంటకు కొంతమేర అందిస్తున్నామని తెలిపారు. ఆర్డీఎస్ కింద నిర్దేశించిన ఆయకట్టులో నాలుగో వంతు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఉండేదన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రాజెక్టులు శరవేగంగా నిర్మించుకొని సాగునీటిని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. వారబందీ ప్రకా రం పంటలకు సాగునీరు అందించాలన్నారు. తు మ్మిళ్ల 1,2 పంపులు పూర్తయితే చివరి ఆయకట్టు వరకు నీరు అందుతుందని మంత్రి వివరించారు. ప్రాజెక్టుల పనుల పురోగతికి సంబంధితశాఖ ఇంజినీర్లు కృషి చేయాలని, పనులు త్వ రగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కాలువల డి స్ట్రిబ్యూటర్లు సరిగ్గా ఉండేలా హద్దులు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాకు సం బంధించి ప్రతి ఏటా లభ్యత ఉన్న ప్రాజెక్టుల ద్వారా నీటిని వదులుకునే లా ప్రణాళిక తయారు చేయాలన్నారు. పంటల విషయంలో రైతులకు మించిన విజ్ఞానవంతులు ఎవరూ లేరని మంత్రి కితాబిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకనే సాగునీటి ప్రాజెక్టులు వేగవంతమయ్యాయని తెలిపారు. రాష్ట్రంలోనే సాగుకు యోగ్యమైన 35 లక్షల ఎకరాల భూమి ఉమ్మడి జిల్లాలో ఉన్నదని తెలిపారు. జూరాల కింద 34,413 ఎకరా లు, ఆర్టీఎస్ కింద 21 వేల ఎకరాలకు, రాజీవ్ బీమా కింద 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రతిపాదన లు సిద్ధం చేసినట్లు తెలిపారు. జూరాల ప్రాజెక్టు ద్వారా 9.583 టీఎంసీలు, మిషన్ భగీరథ ద్వారా 2,663 టీఎంసీ లు అందుబాటులో ఉన్నట్లు మంత్రి పే ర్కొన్నారు. 8 విడుతలుగా రూ.50 వేల కోట్లు రైతుబంధు సాయంగా అందించినట్లు వివరించారు. వానకాలంలో రాష్ట్రంలో 62.13 లక్షల ఎకరాల్లో వరి సాగైందని, అయితే కేంద్రానికి నమ్మశ క్యం కాలేదని, అందుకే ప్రతి ఎకరాకూ సంబంధించిన లెక్కలు చూపించామన్నారు. యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం చెప్పడం రైతులకు బాధాకరమని చెప్పారు.
ముందస్తు సమాచారమివ్వాలి :ఎంపీ రాములు
సాగునీటి సలహాబోర్డు సమావేశానికి సంబంధించి ముందస్తు సమాచారం ఇవ్వాలని అధికారులకు నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు సూచించారు. సమాచా రం ఇవ్వడం ద్వారా అధ్యయనం చేయడానికి వీలుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. యాసంగి పంటకు సరిపడా నీరందించేలా చర్యలు తీసుకునేందుకు అడ్వయిజరీ సమావేశం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.
చివరి ఆయకట్టుకూ నీరివ్వాలి : ఎమ్మెల్యే అబ్రహం
ఆర్టీఎస్.. అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య సాగునీటి వనరుగా ఉన్నదని అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
కోయిల్‌సాగర్ పనులు పూర్తి చేయండి : ఎమ్మెల్యే ఆల
కోయిల్‌సాగర్ ఎడమ, కుడి కెనాల్ ఆయకట్టు కింద జనవరి నుంచి నీళ్లు అందించాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి కోరారు. మార్చి 30 వరకు నీళ్లు అందించాలని కోరారు. కోయిల్‌సాగర్ కెనాల్లో మిగిలి ఉన్న పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు.
నీటి కష్టాలుండొద్దు : ఎమ్మెల్యే చిట్టెం
యాసంగికి సరిపడా సాగునీటిని రైతులకు ఇబ్బంది లేకుండా అందించాలని ఇరిగేషన్ అధికారులకు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సూచించారు. ఎక్కడా సాగునీటి కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
రోడ్ల నిర్మాణం చేపట్టాలి : ఎమ్మెల్యే బీరం
జూరాల, భీమా, కేఎల్ఐ చివరి ఆయకట్టుకూ సాగునీరు అందించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి కోరారు. రామన్‌పాడ్ నుంచి గోపాల్దిన్నె రిజర్వాయర్ వరకు గేట్లు రిపేర్ చేసి త్వరితగతిన పూర్తి చేసి లీకేజీని అరికట్టాలని, ఆయకట్టు రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను కోరారు.
సమావేశంలో జెడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, చైర్పర్సన్లు సరిత, పద్మావతి, స్వర్ణసుధాకర్‌రెడ్డి, వనపర్తి కలెక్టర్ షేక్‌యాస్మిన్ బాషా, గద్వాల కలెక్టర్ క్రాంతి, మహబూబ్‌నగర్ అదనపు కలెక్టర్, రైతుబంధు సమితి అన్ని జిల్లాల అధ్యక్షులు, ఇరిగేషన్‌శాఖ సీఈలు రఘునాథరావు, రమేశ్, హమీద్‌ఖాన్, ఎస్ఈ సత్యశీలారెడ్డి, ఈఈలు శ్రీనివాసరావు, విజయభాస్కర్‌రెడ్డి, ఏఎస్ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.