బేగంపేట్ : భగవాన్ నేమీనాథ్ జన్మదినక్, కల్యాణక్, దీక్షా కల్యాణక్ మహోత్సవాలు సికింద్రాబాద్ ప్యారడైజ్ హర్యానా భవన్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్ జనరల్బజార్లోని శాంతినాథ్ జైన మందిర్, ఆరాధన భవన్ ఆధ్వర్యం లో శని ఆదివారాల్లో జరగనున్న ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు జంట నగరాల్లోని జైనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇందులో భాగంగ శనివారం కీర్తన్ ప్రభ భక్తులకు భగవంతుని ప్రవచనాలు, భగవాన్ నేమీనాథ్, మహావీర్ సందేశాలను వినిపించారు. అహింస మార్గం గురించి భక్తులకు వివరించారు. భగవాన్ నేమీనాథ్ జన్మ వృత్తాంతాన్ని నాటక రూపంలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
ఆధ్యాత్మిక గురువులు ఆధ్యాత్మిక బొధనలు చేశారు. ఈ సంధర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులకు విశేషంగా ఆకట్టుకున్నాయి. నేమీనాథ్ కల్యాణక్, దీక్షా కల్యాణక్ మహోత్సవాల్లో భాగంగ ఆదివారం సికింద్రాబాద్ మంజు టాకీస్ నుంచి హర్యానా భవన్ వరకు జైనులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.