బీర్కూర్, డిసెంబర్ 24 : మండలంలోని తెలంగాణ తిరుమల ఆలయానికి భక్తులు విరాళాలను అందజేస్తున్నారు. ఆలయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శుక్రవారం దర్శించుకొని ప్రత్యేకపూజలు చేశారు. మండలంలోని తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఉప్పలపాటి సుబ్బారావు-స్వర్ణలత దంపతులు శ్రీలక్ష్మి-గోదాదేవి అమ్మవార్లకు రూ. 12 లక్షల 80 వేలతో తయారు చేయించిన రెండు బంగారు హారాలు, రెండు పగడపు ముక్కు పుడకలను స్పీకర్ చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. కోటగిరి మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గుజాల కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వేంకటేశ్వర స్వామి వారికి బంగారు కిరీటం తయారీలో తమ వంతుగా రూ. 40 వేలు విరాళం అందజేశారు. దాతలకు స్వామి వారి ఆశీస్సులు ఉంటాయని స్పీకర్ అన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్రావు, ద్రోణవల్లి అశోక్, కొరిపెల్లి రాంబాబు, నర్సరాజు, సత్యనారాయణ, మేనేజర్ విఠల్ తదితరులు పాల్గొన్నారు.