e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News సంబురంగా కొత్తింటికి..

సంబురంగా కొత్తింటికి..

  • పేదల ఇంటికలను సాకారం చేస్తున్న సీఎం కేసీఆర్‌
  • త్వరలో సొంతజాగాలో ఇల్లు కట్టుకునే పథకం ప్రారంభం
  • మంచి పనులను చెడగొట్టేవారి మాటలను పట్టించుకోవద్దు
  • వేల్పూర్‌లో 112 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్ల ప్రారంభోత్సవంలో మంత్రి ప్రశాంత్‌రెడ్డి

వేల్పూర్‌, డిసెంబర్‌ 8: సొంత స్థలాలు ఉన్నవారు ఇండ్లు కట్టుకునే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలోని తన సొంత గ్రామమైన వేల్పూ ర్‌లో రూ.7 కోట్ల నిధులతో నిర్మించిన 112 డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లను మంత్రి బుధవారం ప్రారంభించారు. లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి గృహప్రవేశాలు చేయించారు. ఇండ్ల సముదాయానికి కేసీఆర్‌ కాలనీగా నామకరణం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఇండ్లు లేనివారు ఆందోళన చెందొద్దని, సొంతజాగా ఉన్నవారందరికీ రాబోయే రోజుల్లో ఇండ్లు మంజూరు చేస్తా మన్నారు. తన సొంత గ్రామంలో పేదలకు ఇండ్లు అందజేయడం ఆనందంగా ఉందని, లబ్ధిదారులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. రాజకీయాలకు తావులేకుండా అర్హులకే ఇండ్లను కేటాయించామని తెలిపారు. మంచి పనులు చేస్తున్నప్పుడు చెడగొట్టేవారి మాటలను పట్టించుకోవద్దన్నారు.

కాంగ్రెస్‌ హయాంలో కాగితాలపైనే..

- Advertisement -

గత ప్రభుత్వాలు ఇండ్లు ఇచ్చిఉంటే ఇప్పుడు ఇంతమంది గూడులేని వారు ఉండేవారు కాదన్నారు. కాంగ్రెస్‌ హ యాంలో ఇండ్లు కాగితాలకే పరిమితమయ్యాయని, డబ్బులు లీడర్ల జేబుల్లోకి వెళ్లాయని విమర్శించారు. 22 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బీజేపీ.. పేదవారి కోసం ఒక్క డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లుకూడా కట్టించలేదని అన్నారు. స్వరాష్ట్రం లో సీఎం కేసీఆర్‌ ఏడేండ్లుగా అన్నివర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని గుర్తుచేశారు. పేదల కోసం ఇంత గా పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారిని ఏమనాలో ప్రజలే ఆలోచించాలన్నారు. సొంతింటి కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్‌, మంత్రి వేములకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌ రాధ, జిల్లా నోడల్‌ అధికారి, డీసీవో సింహాచలం, ఆర్మూర్‌ ఆర్డీవో శ్రీనివాసులు, ఎంపీపీ జమున, ఏఎంసీ చైర్మన్‌ చిన్నారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌ మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ మహేశ్‌, ఉప సర్పంచ్‌ సత్యం, టీఆర్‌ఎస్‌ మండల కన్వీనర్‌ నాగధర్‌, ప్రతాప్‌, మహిపాల్‌, గ్రామ అధ్యక్షుడు మోహన్‌దాస్‌, ఏలేటి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement